Airtel Offer: ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ ఇప్పుడు మార్కెట్‌లో వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌తో వచ్చింది. సాధారణంగా మనం ఇంటర్నెట్ కోసం వేర్వేరు కనెక్షన్లు, టీవీ ఛానెల్స్ కోసం వేర్వేరు డీటీహెచ్ కనెక్షన్లు, అలాగే ఓటీటీ యాప్‌ల కోసం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ మూడు అవసరాలన్నింటినీ ఒకే ప్లాన్‌లో అందిస్తోంది ఎయిర్‌టెల్.
సూపర్‌ఫాస్ట్ వై-ఫై
ఇందులో ప్రధానంగా చూడాల్సింది ఇంటర్నెట్ సర్వీస్. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ ద్వారా మనకు సూపర్‌ఫాస్ట్ వై-ఫై లభిస్తుంది. అంటే 100 ఎంబీపీఎస్ నుండి 1 జీబీపీఎస్ వరకు స్పీడ్ ఉన్న హై క్వాలిటీ ఇంటర్నెట్ పొందవచ్చు. వీడియో కాల్స్, గేమింగ్, ఆఫీస్ వర్క్, స్టడీస్ అన్నింటికీ ఇది బాగా సరిపోతుంది.
350కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్
తర్వాత టీవీ ఛానెల్స్ గురించి చెప్పుకుంటే, ఈ ప్యాక్‌లో 350కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ అందుబాటులో ఉంటాయి. అంటే మనకు న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, మూవీస్, మ్యూజిక్ ఏ విభాగమైనా అన్ని రకాల ఛానెల్స్ ఒకే కనెక్షన్‌తో చూడొచ్చు.
Also Read: Jio Lucky Draw: జియో లక్కీ డ్రా.. గెలిస్తే 20జిబి డేటా ఫ్రీ! పూర్తి వివరాలు
ఒకే కనెక్షన్‌తో అన్నింటినీ యాక్సెస్
ముఖ్యమైన ఫీచర్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ, హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, ఎరోస్ నౌ, హంగామా వంటి 20కి పైగా ప్రముఖ ఓటీటీ యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ ఈ ప్యాక్‌లోనే ఫ్రీ గా లభిస్తుంది. అంటే మీరు వేరే వేరే యాప్‌లకు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకే కనెక్షన్‌తో అన్నింటినీ యాక్సెస్ చేయవచ్చు.
70 శాతం వరకు డిస్కౌంట్
ఇప్పుడు ధర గురించి మాట్లాడితే, ఈ సర్వీస్ అసలు ధర రూ.2199. కానీ ఇప్పుడు ఆఫర్‌లో కేవలం రూ.699కే అందిస్తున్నారు. అంటే 70 శాతం వరకు డిస్కౌంట్ అని చెప్పొచ్చు. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
వెంటనే ఈ ఆఫర్ ప్యాక్‌ని బుక్ చేసుకోండి
ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులకు ఒకేసారి మూడు ప్రయోజనాలు వస్తాయి. సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్, వందల కొద్దీ టీవీ ఛానెల్స్, మరియు డజన్ల కొద్దీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్. ముఖ్యంగా ఫ్యామిలీ యూజ్‌కి ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకరికి టీవీ కావాలి, మరొకరికి ఇంటర్నెట్ కావాలి, ఇంకొకరికి ఓటీటీలు కావాలి, ఈ మూడింటినీ ఒకే ప్యాక్‌లో అందిస్తుంది ఎయిర్ టెయిల్. ప్రతి ఇంటికి సరిపడే ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. కేవలం రూ.699లో ఇంత బెనిఫిట్ ఇవ్వడం చాలా అరుదైన విషయం. కాబట్టి ఈ ఆఫర్ ముగియకముందే మీరు కూడా ఈ ప్యాక్‌ని బుక్ చేసుకోవడం మంచిది.