Motorola Edge 60 Pro: మోటరోలా మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అందరినీ ఆకట్టుకునేలా కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. ఈసారి విడుదల చేసిన ఫోన్ పేరు మోటరోలా ఎడ్జ్ 60 ప్రో. ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకతలు చూస్తే నిజంగానే టెక్నాలజీ ప్రేమికులను ఆశ్చర్యపరచేలా ఉన్నాయి. డిజైన్ విషయంలో ఇది చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో తయారైంది. వెనక భాగంలో గాజు ఫినిష్ ఉండటంతో చేతిలో పట్టుకున్నా ఒక రకమైన లగ్జరీ ఫీలింగ్ ఇస్తుంది. 6.7 అంగుళాల పోల్డ్ డిస్‌ప్లేలో 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో గేమింగ్ అయినా, వీడియోలు చూసినా, సోషల్ మీడియా స్క్రోల్ చేసినా చాలా స్మూత్ అనుభవం ఇస్తుంది. హెచ్‌డీఆర్10, సపోర్ట్ వలన రంగులు సహజంగా, చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
200 మెగా పిక్సెల్ కెమెరా
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ కెమెరా. 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా వలన ఫోటోలు తీసినప్పుడు డీటైల్స్ అద్భుతంగా రాబోతాయి. ఇంత పెద్ద కెమెరా రిజల్యూషన్ వలన జూమ్ చేసినా పిక్సెల్స్ చెదరకుండా స్పష్టత ఉంటుందనే విషయం వినియోగదారులకు పెద్ద ప్లస్. దీనికి తోడు 50 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 12 మెగా పిక్సెల్ టెలి ఫోటో లెన్స్ ఉండటంతో ఫోటోగ్రఫీకి ఇది పర్ ఫెక్ట్ స్మార్ట్ ఫోన్‌గా మారింది. రాత్రి పూట వెలుతురు తక్కువగా వున్నా కూడా అద్భుతమైన ఫొటోలు తీయగలగడం దీని ప్రత్యేకత. ముందు భాగంలో 60 మెగా పిక్సెల్ కెమెరా ఉండటంతో సెల్ఫీలు సూపర్ క్వాలిటీతో వస్తాయి. వీడియో రికార్డింగ్ విషయంలో 8కే రిజల్యూషన్ వరకు సపోర్ట్ ఇవ్వడం మరో అదనపు ఆకర్షణగా నిలిచింది.
Also Read: Airtel Offer: ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్.. ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ అన్నీ ఒక్క ప్లాన్‌లోనే!
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్
పనితీరును తీసుకుంటే ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వేశారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్, భారీ యాప్స్ అన్నింటినీ సులభంగా నడిపించగల శక్తివంతమైన చిప్‌సెట్. 12జిబి ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండటంతో వేగం, స్థలం అనే సమస్యలు ఎదురయ్యే అవకాశమే లేదు. బ్యాటరీ 5,000 ఎమ్ఏహెచ్ సామర్థ్యంతో వస్తోంది. ఒకసారి చార్జ్ చేస్తే పూర్తి రోజంతా నిర్బంధం లేకుండా ఉపయోగించుకోవచ్చు. 125డబ్ల్యూ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వలన కొన్ని నిమిషాల్లోనే ఎక్కువ శాతం చార్జ్ అయిపోతుంది. అదనంగా 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం గమనించదగిన విషయం.
ఎన్ఎఫ్‌సీ వంటి ఆధునిక ఫీచర్లు
సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 14 మీద నడిచే ఈ ఫోన్ మోటరోలా ప్రత్యేకమైన క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. బ్లోట్వేర్ లేకుండా (అవసరంలేని, ముందే వేసిన యాప్‌లు లేకుండా) స్మూత్ అనుభవం కల్పించడం దీని మరో ఆకర్షణగా నిలిచింది. మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. కనెక్టివిటీ విషయంలో 5జి, వైఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ డిస్ ప్లేలోనే ఉండటంతో ఫోన్‌ను అన్ లాక్ చేయడం చాలా వేగంగా జరుగుతుంది.
ధర విషయానికి వస్తే?
ధర పరంగా చూస్తే భారత మార్కెట్లో దాదాపు రూ.49,999 ధరలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ రేంజ్‌లో ఇప్పటికే ఉన్న ఫోన్లతో పోలిస్తే మోటారోలా ఎడ్జ్ 60 ప్రో ప్రత్యేకంగా నిలబడి పోటీని పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద మోటరోలా ఎడ్జ్ 60 ప్రో అనేది కేవలం ఒక ఫోన్ కాదు, పూర్తి స్థాయి టెక్నాలజీ అనుభవాన్ని ఇచ్చే ప్యాకేజ్. కెమెరా, పనితీరు, డిజైన్, బ్యాటరీ అన్నింటినీ కలిపి ఒకే ఫోన్‌లో కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా చెప్పవచ్చు.