Little Hearts Collection : ఈమధ్య చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా క్యూట్ లవ్ స్టోరీ తో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. ఇప్పటికే ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. తాజాగా మరో క్యూట్ లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ మూవీ లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఈనెల 5వ తేదీన థియేటర్ వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. అలాగే కలెక్షన్ల పరంగా కూడా దుమ్ము దులిపేస్తుంది. మొదటి రోజు నుంచి భారీగా వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా ఈ వీకెండ్ కలెక్షన్లు మరింత పెరిగినట్లు సమాచారం. మరి ఈ వీకెండ్ ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూడాలి..
సింజిత్ యెర్రమల్లి సంగీతం, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫి, శ్రీధర్ సొంపలి ఎడిటర్‌గా, దివ్య పవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై స్ట్రాంగ్ కంటెంట్‌తో రూపొందింది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే ప్రీమియర్లను ప్రదర్శించారు. ఈ సినిమాను ముందుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో రిలీజ్ చేయాలని అనుకున్నారట.. కానీ మూవీ నుంచి బయటికి వచ్చిన అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్లలో రిలీజ్ చేశారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు.
ఈ మూవీకి మొదటి రోజు 1.35 కోట్ల నెట్ వచ్చాయి. ఇక రెండో రోజు – 1.6 కోట్లు వచ్చాయట. ఇక ఆదివారం ఈ సినిమాకు 2 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా లిటిల్ హార్ట్స్ మూవీ మొదటి వారం (మూడు రోజుల్లో) మొత్తం 4.9 కోట్ల నెట్, 12 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని తెలుస్తుంది. దీనిపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది. ఏమైనా కూడా భారీ చిత్రాలతో ఈ సినిమా పోటీలో నిలవడం మామూలు విషయం కాదు. స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో కలెక్షన్లు కూడా మంచిగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read : దారుణంగా పడిపోయిన కలెక్షన్స్… పాపం అనుష్కకు ఐదు కోట్లు కూడా రాలేదు
ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా కొనసాగుతుందన్న విషయం తెలిసిందే.. గతంలో వచ్చిన హనుమాన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అదేవిధంగా ఈ నెలలో రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమా కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. ఈ మూవీకి దాదాపు రెండున్నర కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు.. అయితే బిజినెస్ పరంగా చూస్తే రిలీజ్ కి ముందే హిట్ అయిందని తెలుస్తుంది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.. ఈ మూవీ మూడు రోజుల్లో దాదాపు 10 కోట్ల రూపాయల కలెక్షన్ల మైలురాయిని అధిగమించడం ఖాయం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల రూపాయలు.. అటు అమెరికాలో 170 K డాలర్లు వసూల్ చేసింది తెలుస్తుంది. మొత్తానికి ఈ మూవీ అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరుని కొనసాగిస్తుంది.. మరి కొన్ని రోజులు టాక్ నడిస్తే 50 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు..