Madharaasi Collection :కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఒకవైపు తమిళ్లో సినిమాలు చేస్తూనే.. మరొకవైపు ఆ చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటు తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా ‘మదరాసి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ డైరెక్టర్ ఏ. ఆర్. మురగదాస్ (AR Muragadas) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5వ తేదీన అనుష్క ఘాటి మూవీకి పోటీగా ఈ సినిమా విడుదలయ్యింది. అటు ఈ రెండు చిత్రాలకు పోటీగా లిటిల్ హార్ట్స్ అనే మరో మూవీ కూడా విడుదలైంది. ఇక భారీ అంజనాల మధ్య మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ లిటిల్ హార్ట్స్ రేంజ్ లో మిగతా రెండు సినిమాలు సత్తా చాటలేక పోయాయనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే శివ కార్తికేయన్ మదరాసి సినిమా సెప్టెంబర్ 5 నుంచి ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది హీరో లాభపడ్డారా అనే విషయం ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే ఈ మదరాసి చిత్రానికి మూడు రోజులకు గానూ రూ. 36.60 కోట్ల నెట్, దాదాపు 65.6 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయానికి వస్తే.. రూ. 13.7 కోట్ల నెట్ వచ్చింది. అంటే ప్రాంతీయంగా చూసుకుంటే.. తమిళ్ నుండీ రూ.12 కోట్లు. హిందీ రూ.30 లక్షలోపు లభించినట్లు సమాచారం.. ఇక తెలుగు నుండీ రూ.1.4 కోట్లు లభించాయి. మొత్తానికైతే మూడు రోజులకు గాను రూ.36.60 కోట్ల నెట్ రాబట్టింది ఈ సినిమా.
ALSO READ:Bigg Boss 9 Promo: మొదలైన యుద్ధం.. మొదటి రోజే ఫైటింగ్‌కి దిగిన మాస్క్ మ్యాన్
తీరని నష్టం..
ఓవరాల్ గా చూసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి రూ.91 కోట్ల నెట్ రావాలి.. కానీ మొదటి వీకెండ్ కి కేవలం రూ.36 కోట్లు వచ్చాయి అంటే ఇంకా దాదాపు రూ.55 కోట్ల నెట్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది.. ఇంత సాధించడం ఇప్పుడు కష్టమే. మొత్తానికైతే మురగదాస్ మూవీకి మరో భారీ డిజాస్టర్ ఇది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా 50 కోట్లు వచ్చినా సరే ఈ సినిమాకి నష్టం తప్పదు అనడంలో సందేహం లేదు.
మదరాసి సినిమా రివ్యూ..
కథ విషయానికి వస్తే.. తమిళనాడులో తుపాకీ సంస్కృతిని అలవాటు చేసి సొమ్ము చేసుకోవాలనేదే అక్కడి సిండికేట్ పన్నాగం. ఇందులో విరాట్, చిరాగ్ అనే ఇద్దరు స్నేహితులని రంగంలోకి దించి పెద్ద ఎత్తున ఆయుధాలను ఆ సిండికేట్ తరలిస్తూ ఉంటుంది. అవన్నీ ఒక ఫ్యాక్టరీకి చేరుతూ ఉండగా ఎన్ఐఏ కి తెలుస్తుంది. ప్రేమ్ నాథ్ నేతృత్వంలోని ఎన్ ఐ ఏ ఆపాలని ప్రయత్నించినా.. అది సాధ్యపడదు. దాంతో ఆయుధాలు నిల్వ ఉంచిన ఫ్యాక్టరీ మొత్తాన్ని పేల్చివేయాలనే ఒక ఆపరేషన్ కి నడుం బిగుస్తుంది ఎన్ఐఏ. అయితే ఆపరేషన్ అంత సులభమైనది కాదు. ఒకరి ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి ఉంటుంది. సరిగా అదే సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రఘురాం ను ప్రేమ్ నాథ్ కలుస్తారు. ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయని రఘురామ్ ని ఆపరేషన్ కోసం తీసుకోవాలని నిర్ణయిస్తారు.. అలా ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయిందా? అసలు రఘురాం ఎవరు? ఎందుకు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ? ఇలా తదితర విషయాలు తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే.