The Conjuring Collection : హాలీవుడ్ చిత్రానికి తెలుగులో డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. అక్కడ బాక్సాఫీస్ ని షేర్ చేసిన సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా వరుసగా రికార్డులు సొంతం చేసుకుంటున్నాయి.. ఈమధ్య తెలుగులో రిలీజ్ అయిన హాలీవుడ్ చిత్రాలు మంచి కలెక్షన్లను వసూలు చేశాయి. తెలుగులో రిలీజ్ అయిన హాలివుడ్ వెబ్ సిరీస్ ది ‘కాంజురింగ్’. 2013, జులై 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి ఆడియన్స్ కి ఈ సినిమా ఇచ్చిన థియేట్రికల్ అనుభూతి సాధారణమైనది కాదు. చాలా కాలం తర్వాత ఒక మంచి హారర్ సినిమా ఫీలింగ్ కలుగుతుంది. ఆ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఈ మూవీ కలెక్షన్లను ఒకసారి చూద్దాం..
సెప్టెంబర్ 5న థియేటర్లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ఇది. నాలుగు భాగాలుగా రిలీజ్ చేశారు. 2013, 13 జూలైన మొదటి భాగం రిలీజ్ చేశారు. మొదటి భాగం పెద్ద హిట్ అవ్వడం తో రెండవ భాగాన్ని 2016 జూన్ 10 న విడుదల చేశారు. ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత మూడవ భాగాన్ని 2021 జూన్ 4 న విడుదల చేయగా అది కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఐదవ భాగాన్ని కూడా రిలీజ్ చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మూడు రోజుల్లోనే 1500 కోట్లను వసూలు చేసింది.. డబ్బింగ్ చిత్రాలకు ఈ కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. మొదటి రోజున ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 18 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..
నిజానికి హాలీవుడ్ చిత్రాలకు డిమాండ్ ఎక్కువే.. తెలుగులో రిలీజ్ అయిన భారీ యాక్షన్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటుగా.. తెలుగు సినిమాలకన్న ఎక్కువగా వసూలను రాబడుతున్నాయి. సెప్టెంబర్ 5న తెలుగుతో పాటు బాలీవుడ్ చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి.. 2D ఫార్మటు స్క్రీన్స్ లో ఈ చిత్రం ఓవరాల్ గా 61 శాతం ఆక్యుపెన్సీ ని నమోదు చేసుకుంది. మార్నింగ్ షోస్ కి కేవలం 44 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది, కానీ రాత్రి షోస్ కి ఏకంగా 78 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.. అటు హిందీలో కూడా ఎక్కువ ఆక్యుపెన్సిని నమోదు చేసుకుంది. మిగిలిన ఫార్మట్స్ లో 4Dx ఫార్మట్ లో ఏకంగా 91 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యినట్టు ఓ వార్త వినిపిస్తుంది. ఇక ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి 2200 స్క్రీన్స్ లలో రిలీజ్ అయింది.. హాలీవుడ్ హారర్ చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం గతంలో ఎన్నడూ చూడలేదు. కేవలం మూడు రోజుల్లోనే 1500 కోట్లు వసూలు చేసింది అంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ముందు ముందు కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..