Anjana Devi: అంజనాదేవి (Anjana Devi) పరిచయం అవసరం లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి తల్లిగా అందరికీ ఎంతో సుపరిచితమే. ఇక ఈమె గత కొంతకాలంగా తన కోడలు సురేఖ అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ (Attammas Kitchen)ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బిజినెస్ కారణంగా ఉపాసన (Upasana) నిత్యం తన అత్తయ్య సురేఖ అలాగే తన అమ్మమ్మ అంజనా దేవికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో అంజనాదేవి ఆరోగ్యం ఏమాత్రం బాగలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. గత కొద్దిరోజుల క్రితం అంజనా దేవి అనారోగ్యానికి(Health Issues) గురికావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారని దీనితో పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగ్ కూడా రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.
అంజనాదేవికి ఏమైంది?
ఇలా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకోవడంతో తన ఆరోగ్యం గురించి అభిమానులు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)స్పందిస్తూ తన అమ్మ క్షేమంగా ఉందని సోషల్ మీడియాలో తన తల్లి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి తన తల్లి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
అనారోగ్య సమస్యలతో అంజనా దేవి…
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా పూర్తిస్థాయిలో ప్రమోషన్ల పై దృష్టి సారించారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా క్యాబినెట్ మీటింగ్ కు హాజరు కాకపోవడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. తాను రెండుసార్లు క్యాబినెట్ మీటింగ్ కి హాజరు కాలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒకసారి తనకు అనారోగ్య సమస్య కారణంగా హాజరు కాలేదని అయితే గత కొద్దిరోజుల క్రితం అమ్మకు బాగా లేకపోవడంతోనే క్యాబినెట్ మీటింగ్ లో పాల్గొనలేదని తెలిపారు.
హాస్పిటల్లోనే అంజనాదేవి?
తన తల్లి క్షేమంగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి కదా అనే ప్రశ్న కూడా ఎదురవడంతో కేవలం బయటికి ఆ వార్త తెలియకూడదన్న ఉద్దేశంతోనే అలా చెప్పామని అమ్మ ఇప్పటికీ కూడా హాస్పిటల్లో ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటుందని పవన్ కళ్యాణ్ తన తల్లి ఆరోగ్యం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి. దీంతో అంజనదేవికి ఏమైంది? ఇన్ని రోజులు హాస్పిటల్ లో ఉండడానికి గల కారణాలు ఏంటి? అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాలు గురించి క్లారిటీ రావాలి అంటే మెగా కుటుంబ సభ్యులు అంజనా దేవి ఆరోగ్యం గురించి పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.. ఇక అంజనా దేవికి ఐదుగురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు కాగా, ముగ్గురు అబ్బాయిలనే విషయం అందరికీ తెలిసిందే.
Also Read: Pawan Kalyan: ఇట్స్ అఫీషియల్.. నిర్మాతగా పవన్ కళ్యాణ్.. త్వరలోనే కొత్త సినిమా?