Sreeleela:ఇండస్ట్రీలో గాసిప్స్ అనేవి కామన్. ఒక సినిమాలో నటించిన హీరో హీరోయిన్ బయట కనిపిస్తే.. వారిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టిస్తారు. ఇక ఏకంగా వెకేషన్ లోనో.. రెస్టారెంట్ లోనో కనిపిస్తే అంతే సంగతులు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని రాసేస్తూ ఉంటారు. అయితే ఒకసారి కాకుండా ఏడాది పొడువునా ఆ ఇద్దరే జంటగా కనిపిస్తే.. మా మధ్య ఏది లేదంటూనే కలిసి కనిపిస్తే అప్పుడు ఏమనాలి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇలాంటి జంటలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య ఏమున్నది అనేది ఇప్పటివరకు తెలియదు. విజయ్ ఎక్కడ ఉంటే రష్మిక అక్కడ ఉంటుంది. ఏ పండగ వచ్చినా విజయ్ ఇంట్లో వాలిపోతుంది. ఫొటోస్ పెట్టినా పక్కన విజయ్ ఉన్నట్లు తెలిసేలా హింట్స్ ఇస్తుంది. విజయ్ గురించి చెప్పమంటే సిగ్గు పడుతుంది. విజయ్ సైతం.. ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయితోనే డేటింగ్ లో ఉన్నాను అంటాడు.. పెళ్లి చేసుకుంటామంటాడు. కానీ, అది రష్మిక అని మాత్రం చెప్పడు. పైకి మాత్రం మా మధ్య ఏది లేదని చెప్పుకొస్తాడు.
Ranga Sudha: మాజీ లవర్ పై హీరోయిన్ ఫిర్యాదు.. ప్రైవేట్ వీడియోలు తీసి..
ఇప్పుడు విజయ్- రష్మిక జంటలానే బాలీవుడ్ లో ఇంకో జంట తయారయ్యింది. వారే కార్తీక్ ఆర్యన్- శ్రీలీల. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే శ్రీలీల బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జంటగా ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలయ్యిందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే వీరిద్దరూ పార్టీలు, రెస్టారెంట్స్ అంటూ తిరుగుతూ కెమెరా కంటికి చిక్కుతూనే ఉన్నారు.
కార్తీక్ – శ్రీలీల ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే అలాంటిదేమి లేదని శ్రీలీల ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చినా ప్రస్తుతం అది నమ్మే విధంగా లేదు. ఎందుకంటే ఏడాదిగా కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కు శ్రీలీల కుటుంబంతో సహా హాజరవుతుంది. అంతెందుకు ఈ మధ్యకార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్స్ లో కూడా శ్రీలీల తన తల్లితో కలిసి హాజరయ్యింది. వారిద్దరి కుటుంబాలు కలిసి పండగ జరుపుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కార్తీక్ ఆర్యన్ ప్రేమలో శ్రీలీల మునిగి తేలుతుందని స్పష్టమైంది. ఇంకెందుకు దాచడం అని కామెంట్స్ పెడుతున్నారు. వీరు కూడా విజయ్ – రష్మిక లా మారుతున్నారు. పైకి ఏమి చెప్పకుండా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి శ్రీలీల అంత చిన్న వయస్సులో ప్రేమ, పెళ్లి అని కెరీర్ ను నిర్లక్ష్యం చేస్తుందా.. ? అనేది చూడాలి.