YS Raja Reddy: ఏపీ రాజకీయాల్లోకి యువత ఎంట్రీ ఇస్తోందా? ఓ వైపు అధికార టీడీపీ-ఇంకోవైపు జనసేన-మరోవైపు బీజేపీలు ఆ పనిలో నిమగ్నమయ్యాయా? ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ వంతు రానుంది. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వారం రోజులుగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు రాజారెడ్డి వార్తల్లోకి నానుతున్నాడు. విదేశాల్లో చదివి, ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువకుడి చూపు ప్రస్తుతం ఏపీపై పడింది. రీసెంట్‌గా వైఎస్ఆర్ వర్థింతి రోజు ఘాట్ వద్ద తల్లితో కనిపించాడు. తాతతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు.
ఆనాటి నుంచి రాజారెడ్డికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ రోజు షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. తాజాగా ఆ వార్తలకు బలం చేకూరేలా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. సోమవారం కర్నూలులో ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లితో కలిసి అక్కడికి వెళ్లాడు రాజారెడ్డి.
అదే సమయంలో ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఉన్నట్లుండి షర్మిల వెనుక కొడుకు అడుగులు వేయడంతో ఏపీ రాజకీయాల్లోకి ఆరగడుల బుల్లెట్ ఎంట్రీ ఖాయమంటూ వార్తలు హంగామా చేస్తున్నాయి. అందులో నిజం ఎంత అనేది కాసేపు పక్కన బెడదాం.
ALSO READ: ఏపీలో ఫేక్ న్యూస్‌పై ఫైట్.. సీఎం సంచలన నిర్ణయం
షర్మిల, ఆమె కొడుకు రాజారెడ్డి వేస్తున్న అడుగులు ప్రత్యర్థుల శిబిరంలో కలకలం మొదలైంది. ముఖ్యంగా వైసీపీలో అప్పుడే చర్చ మొదలై పోయింది. షర్మిల తన వారసత్వాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు నేతలు మాట్లాడుకోవడం మొదలైంది. అయితే రాజారెడ్డి మాట్లాడే తీరు, హావబావాలు.. వైఎస్ఆర్ స్టయిల్‌లో ఉంటే మనకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
ఈ లెక్కన జగన్‌పై షర్మిల విసిరిన మరొక బాణంగా చెబుతున్నారు. అవసరమైనట్టు రాజకీయాల్లోకి వస్తాడని క్లారిటీ ఇచ్చేశారు షర్మిల. తల్లితో కలిసి కర్నూలు వెళ్లడం వెనుక సరదాగా వెళ్తాన్నాడా? లేకుంటే రాజకీయ ఎంట్రీ ఏమైనా ఉందా అంటూ గుసగుసలు పెట్టేసుకుంటున్నారు. ఒకప్పుడు జగన్ వదిలిన బాణం షర్మిల కాగా, ఇప్పుడు షర్మిల విడిచిన బాణం రాజారెడ్డి అవుతాడేమో?
మొత్తానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వేస్తున్న అడుగులను వైసీపీ శిబిరం నిశితంగా గమనిస్తోంది. రాబోయే రోజుల్లో వైసీపీని ముఖ్యంగా జగన్ మామను ఢీ కొట్టేది మేనల్లుడు రాజారెడ్డి అన్నవాదన ఇప్పుటికే కడప జిల్లాలో మొదలైంది కూడా. రాబోయే రోజుల్లో రాజారెడ్డి ఎలాంటి అడుగులు వేస్తాడో వెయిట్ అండ్ సీ.
రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కొడుకు…?
వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు చక్కర్లు
ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్‌కు తల్లితో సహా సందర్శనకు వెళ్లిన రాజారెడ్డి
ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న రాజారెడ్డి
త్వరలో రాజకీయ రంగ ప్రవేశం… pic.twitter.com/dx1cINDhYL
— BIG TV Breaking News (@bigtvtelugu) September 8, 2025