BigTV English

Boney Kapoor: నన్ను శ్రీదేవి రూంలోకి రానివ్వలేదు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన బోనీ కపూర్!

Boney Kapoor: నన్ను శ్రీదేవి రూంలోకి రానివ్వలేదు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన బోనీ కపూర్!

Boney Kapoor: అతిలోక సుందరి అందాల తారగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీదేవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఆమె సినిమాలలో ఎంత డెడికేటెడ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ.. అనూహ్యంగా బాత్ డబ్ లో పడి మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా శ్రీదేవి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. రాఖీ కట్టిన వ్యక్తిని వివాహం చేసుకోవడమే కాకుండా అతడికి ఆల్రెడీ పెళ్లయి, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఈమె వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక వివాహం అనంతరం జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ జన్మించగా .. ప్రస్తుతం వీరిద్దరూ కూడా నటన రంగంలో బిజీగా మారిపోయారు.


నా భార్య శ్రీదేవి నన్ను గదిలోకి కూడా రానివ్వలేదు – బోనీకపూర్

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ (Boney Kapoor) మాట్లాడుతూ.. తన భార్య శ్రీదేవి తనను గదిలోకి కూడా రానివ్వలేదు అని చెప్పి ఇన్నాళ్లకు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీదేవి చివరిగా నటించిన చిత్రం మామ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ప్రస్తావించగా బోనీ కపూర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా షూటింగు జార్జియాలో జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ ఒక హోటల్లో బస చేసాము. అయితే నా భార్య అయ్యుండి కూడా ఆమె గదిలో ఉండడానికి నా భార్య శ్రీదేవి నన్ను నిరాకరించింది. దీనికి కారణం ఆమె మామ్ అనే సినిమాలో నటిస్తోంది. తన తల్లిపాత్ర నుంచి డైవర్షన్ ఉండకూడదని భావించడం వల్లే భర్త అయిన నన్ను కూడా గదిలోకి ఆహ్వానించలేదు. దీన్ని బట్టి చూస్తే ఆమె తన పాత్ర కోసం ఎంత డెడికేటెడ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈమె లాంటి మరొక నటి లేరు అనేది నా అభిప్రాయం” అంటూ బోనీకపూర్ అసలు విషయాన్ని బయట పెట్టారు.

శ్రీదేవి పై ప్రశంసలు కురిపించిన బోనీకపూర్..


అలాగే శ్రీదేవి గురించి ఆయన మాట్లాడుతూ..” ముఖ్యంగా శ్రీదేవికి ఎంత డెడికేషన్ ఉంటుంది అంటే భాష రాకపోవడం వల్ల హిందీ పరిశ్రమలో ఆమెకు అవకాశాలు రాలేదు. అటు కెరియర్ కి ఇబ్బంది అవుతుందని భావించి హిందీ కూడా నేర్చుకుంది. తనతో పాటే డబ్బింగ్ థియేటర్లో ఒక హిందీ టీచర్ కూడా ఉండేవారు. మామ్ సినిమా విషయంలో కూడా అంతే. తెలుగు డబ్బింగ్ పూర్తి చేసి, మలయాళ వెర్షన్ కి కూడా ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ థియేటర్లో తనతో పాటు ఒక మలయాళ డబ్బింగ్ ఆర్టిస్టును కూడా శ్రీదేవి పక్కనే కూర్చోబెట్టుకొని.. తన నటనకు లిప్ సింక్ అయ్యేలా డబ్బింగ్ కుదిరిందో లేదో చెక్ చేసుకోవడానికి శ్రీదేవి అలా చేశారు. నిజంగా ఆమె చాలా డెడికేట్ గా పనిచేస్తుంది. ఇంతకంటే గొప్ప నటి మరొకరు లేరు.. రారు” అంటూ తన భార్యపై ప్రశంసలు కురిపించారు బోనీ కపూర్.

ఆయన కోసం 70 లక్షలు త్యాగం చేసిన శ్రీదేవి

ఇకపోతే మామ్ సినిమా కోసం రెహమాన్ (AR Rahman) ని ఎంపిక చేసుకున్నాము. ఆయన చాలా ఖరీదైన మ్యూజిక్ డైరెక్టర్. ఆ ఖర్చు నేను భరించలేకపోయాను. ఆఖరికి శ్రీదేవి తన రెమ్యూనరేషన్ నుంచి రూ.70 లక్షలు రెహమాన్ కోసం త్యాగం చేసింది అంటూ కూడా చెప్పుకొచ్చారు.

ALSO READ:Madharaasi Collection : 50 కోట్లు కొట్టిన శివకార్తికేయన్.. అయినా బాబుకు నష్టాలే

Related News

OG Movie: ‘ఓజీ’ కోసం రంగంలోకి 117 మంది సంగీత కళాకారులు.. తమన్‌ క్రేజీ అప్‌డేట్‌

Raghava Lawrence: లారెన్స్ గొప్ప మనసు.. మొన్న కాలు.. నిన్న స్కూటీ.. నేడు ఇల్లు..!

Navya Nair: ఎయిర్ పోర్ట్ లో నటికి చేదు అనుభవం.. మల్లెపూలు తీసుకెళ్లిందని లక్ష జరిమానా

Abhinav Kashyap: సల్మాన్ ఖాన్ ఒక గుండా.. అసభ్యకరమైన వ్యక్తి.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Sreeleela: విజయ్ – రష్మిక లా మారిన శ్రీలీల- కార్తీక్ ఆర్యన్

Big Stories

×