BigTV English

Fauji : ప్రభాస్ సినిమా టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి

Fauji : ప్రభాస్ సినిమా టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి
Advertisement

Fauji : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ లో ప్రభాస్ మరియు హను రాఘవపూడి సినిమా ఒకటి. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఎస్.ఎస్ రాజమౌళి లాంటి దర్శకులు కూడా హను ను విపరీతంగా ఆ రోజుల్లో ప్రశంసించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లవ్ స్టోరీని అందంగా తెరకెక్కించే దర్శకులు ఈ మధ్యకాలంలో అరుదు. ఖచ్చితంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మణిరత్నం ఉంటే ఎలా ఉంటుందో హను రాఘవపూడి సినిమాల అలా ఉంటాయి.


హను రాఘవపూడి సినిమాలు విషయంలో సెకండ్ ఆఫ్ ఎక్కువగా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఆ విషయం హనుకు కూడా తెలిసింది. అందుకే సీతారామం సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాను అద్భుతంగా డిజైన్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కూడా సీతారామం సినిమా అందుకుంది. సినిమా స్థాయి సక్సెస్ కొట్టడం బట్టి ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది.

టైటిల్ గురించి క్లారిటీ 

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా ఫౌజీ అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని వార్తలు వచ్చినా కూడా సినిమా టైటిల్ అదే అని ఇప్పటివరకు దర్శకుడు హను రాఘవపూడి కన్ఫర్మ్ చేయలేదు. నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కూడా పెద్దగా దీని గురించి చెప్పలేదు.


మొదటిసారి హను రాఘవపూడి ప్రభాస్ సినిమా గురించి స్పందించారు. సినిమా టైటిల్ ఫౌజీ నా, కదా అనేది అక్టోబర్ 23వ తారీఖున తెలుస్తుంది. ఆరోజే టైటిల్ కూడా ప్రకటిస్తాం ఆరోజు చూద్దురు గాని అని హను రాఘవపూడి రీసెంట్ గా జరిగిన డ్యూడ్ సినిమా ఈవెంట్లో ఈ విషయాన్ని చెప్పాడు.

ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే 

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు అని ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలుచోట్ల సలార్ సినిమా కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అలానే ప్రభాస్ నటించిన పౌర్ణమి సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది.

ఇక ఈ నెల 31న బాహుబలి సినిమా విడుదల కానుంది. బాహుబలి సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. రెండు పార్ట్స్ తో కలిపి ఒకే సినిమాగా బాహుబలి రానుంది. తెలుగు సినిమా చరిత్రను శిఖరం మీద నిల్చబెట్టిన ఘనత బాహుబలి సినిమాకి ఉంది. అటువంటి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తారు అనేది మనం ఊహించొచ్చు.

Also Read: Nithiin – Sharwanand : నితిన్ వదిలేసిన కథతో శర్వానంద్, ఇద్దరిదీ ఒకే స్థితి

Related News

PEDDI : ఇక గాసిప్స్ కి చెక్, డైరెక్ట్ గా డైరెక్టర్ పెద్ది సాంగ్ గురించి చెప్పేసాడు

Neeraja Kona : నీరజ కోనతో నితిన్ మూవీ… కానీ కండిషన్స్ అప్లై

Mithra Mandali: విషయం వీక్ గా ఉన్నప్పుడే, పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది

Telusukada Pre release: చాలా బాధగా ఉంది.. ఎమోషనల్ అయిన సిద్దు జొన్నలగడ్డ..అదే కారణమా?

Hrithik Roshan: ఢిల్లీ హైకోర్టులో హృతిక్ రోషన్ కు భారీ ఊరట… వెంటనే ఆ పని చేయాలంటూ!

‎Ahana Krishna: ఖరీదైన కారు కొన్న నటి… ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

‎Sai Durga Tej: బ్రో తర్వాత నా సినిమాలు ఆగిపోయాయి.. సాయి తేజ్ ఎమోషనల్!

Big Stories

×