Hyderabad Postal: హైదరాబాద్ వాసులకు జనరల్ పోస్ట్ ఆఫీస్(GPO) గుడ్ న్యూస్ చెప్పింది. 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం నైట్ షిఫ్ట్ ప్రారంభించింది. స్పీడ్ పోస్ట్ లెటర్లను రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. పగటిపూట రద్దీతో ఇబ్బంది పడే వారి కోసం ఈ సదుపాయం కల్పించింది.
అక్టోబర్ 15, 2025 నుంచి ఈ విధానం అమలు చేస్తున్నట్లు జీపీఓ తెలిపింది. రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఈ నూతన విధానంతో ఎలాంటి అంతరాయం లేకుండా పోస్టల్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చీఫ్ పోస్ట్ మాస్టర్ తెలిపారు. రాత్రి లేదా పగలు ఏ సమయంలోనైనా స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్లను బుక్ చేసుకునేందుకు ఈ సేవలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన 24×7 స్పీడ్ పోస్టల్ సేవను ఉపయోగించుకోవాలని హైదరాబాద్ జీపీఓ వినియోగదారులను కోరింది. నగరంలో పోస్టల్ కార్యకలాపాలలో పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
అక్టోబర్ 15 నుంచి భారతదేశం అమెరికాకు అన్ని రకాల అంతర్జాతీయ పోస్టల్ సేవలను తిరిగి ప్రారంభించిందని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని పోస్టల్ విభాగం మంగళవారం ప్రకటించింది.
“అక్టోబర్ 15, 2025 నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)కి అన్ని రకాల అంతర్జాతీయ పోస్టల్ సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు” పోస్టల్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియా పోస్ట్ అమెరికాకు షిప్‌మెంట్‌ల కోసం నూతన డెలివరీ డ్యూటీ పెయిడ్ (DDP) వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు పారదర్శకంగా షిప్పింగ్‌తో పార్శిళ్లు, పత్రాలు, బహుమతులను పంపవచ్చు.
ఢిల్లీ, మహారాష్ట్ర సర్కిల్‌లలో విజయవంతంగా పరీక్షించిన తర్వాత, ఇండియా పోస్ట్ డెలివరీ డ్యూటీ పెయిడ్ (DDP) ప్రాసెసింగ్ కోసం ఒక కంప్లైంట్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేసింది.