BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్ ప్రకటించింది. రూ.1కే బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ ప్రకటించింది. ఉచితంగా సిమ్ తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు పొందండి. నూతన కస్టమర్లకు అక్టోబర్ 15 – నవంబర్ 15, 2025 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో ఒక రూపాయి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు దానికి ఒక సెంటిమెంట్ గా చూస్తారు. ఒక రూపాయిని శుభప్రదమైన ప్రారంభంగా భావిస్తారు. వివాహాలు, దేవాలయాలలో, కొత్త వ్యాపారం ప్రారంభంలో ఒక రూపాయి కానుకలను చూస్తుంటాము. బీఎస్ఎస్ఎల్ ఈ విషయాన్ని గుర్తుచేస్తూ సూపర్ ఆఫర్ ప్రకటించింది. సిమ్ ధరను రూ. 1గా నిర్ణయించింది. ఒక్క రూపాయికే కొత్త కనెక్షన్ ఇస్తూ కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించింది.
ఇతర టెలికాం తరహాలో కాకుండా కేవలం ఒక రూపాయికే కొత్త ప్లాన్ ఇస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ.199, రూ.249 ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మొదటి నెలకు రూ.1కే డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు కల్పిస్తుంది.
దీపావళి అంటే బహుమతులు, ఆఫర్ల సీజన్. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ఈ పండుగ మూడ్‌కు సరిగ్గా సరిపోతుంది. ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి స్వదేశీ కంపెనీలు మెరుగైన సేవలు అందిస్తున్నాయి.
ఈ ఆఫర్‌ను పై బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఎ. రాబర్ట్ రవి మాట్లాడుతూ.. ‘BSNL ఇటీవలె దేశవ్యాప్తంగా మేక్-ఇన్-ఇండియా, హైస్పీడ్ 4G మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ ను ముందుకు తీసుకువెళుతుంది. దీపావళి బొనాంజా ప్లాన్ మొదటి 30 రోజులు సర్వీస్ ఛార్జీలు పూర్తిగా ఉచితం. స్వదేశీ టెక్నాలిజీ 4G నెట్‌వర్క్‌ను కస్టమర్లకు అందిస్తున్నాము’ అని తెలిపారు.
Also Read: Diwali Gold: రూ.41 వేలకే 10 గ్రాముల బంగారం కొనేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు