Mithra Mandali: రీసెంట్ టైమ్స్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు కథతో సంబంధం లేదు అనే విధంగా ఆలోచిస్తూ స్టోరీలు రెడీ చేస్తున్నారు. కథలో ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది. కానీ కథలో క్లారిటీ లేకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే పెడదాం అంటే అన్ని సందర్భాల్లో అది వర్కౌట్ కాదు. కొన్ని సందర్భాలలో బెడిసి కొడుతుంది. మిత్రమండలి సినిమా విషయానికొస్తే దాదాపు ఈ సినిమా అటు ఇటుగా ఉంది. కొంతమంది అయితే ఎటేటో పోతుంది అని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.
సినిమాని చూసి హ్యాపీగా నవ్వుకుందాం అని చాలామంది బలంగా నమ్మి థియేటర్ కు వచ్చారు. గతంలో లిటిల్ హార్ట్స్ సినిమాకి వేసినట్లే ఈ సినిమా కూడా ప్రీమియర్స్ వేశారు. కానీ రిజల్ట్ విషయంలో కంప్లీట్ డిఫరెన్స్ గా ఉంది. ప్రేక్షకులు అసహనానికి గురవుతున్నారు. వాస్తవం మాట్లాడుకుంటే మధ్యలో నుండి కొందరు వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మించిన సంగతి తెలిసిందే. బన్నీ వాసు మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్, కానీ కొన్ని సందర్భాల్లో అతను తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు అని చాలా సినిమాల ఫలితాలు రుజువు చేస్తాయి. తాజాగా మిత్రమండలి కూడా అదే కోవాకు చెందుతుంది అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి పాజిటివ్ గా వచ్చే కామెంట్స్ చాలా తక్కువ.
అయితే ఈ సినిమా విడుదలకు ముందే కావాలని ఈ సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బన్నీ వాసు స్టేజ్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా తన వెంట్రుక కూడా చూపించి నేను జీవితంలో ఇంకా ముందుకు వెళ్తాను పరిగెడుతూనే ఉంటాను అని కీలకమైన వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
మల్లికార్జున్ థియేటర్ నుండి ఫ్రస్టేషన్ తో బన్నీ వాసు బయటకు వెళ్లిపోయారు అని సోషల్ మీడియాలో ఒక టాపిక్ నడుస్తుంది. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది పక్కన పెడితే సినిమా రిజల్ట్ మాత్రం కొంచెం మిక్స్డ్ గానే వినిపిస్తుంది.
పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రియదర్శి. ఆ సినిమా ఇచ్చిన ఫేమ్ తో చాలా అవకాశాలు వచ్చాయి. కోర్టు లాంటి సినిమాలు మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. అయితే హీరోగా చేస్తున్న సినిమాలు మాత్రం ఊహించిన స్థాయి సక్సెస్ బాక్స్ ఆఫీస్ వద్ద అందుకోలేకపోతున్నాయి.
ప్రియదర్శి హీరోగా నటించిన డార్లింగ్, సారంగపాణి జాతకం, ఇప్పుడు మిత్రమండలి ఈ సినిమాలన్నిటికీ కూడా ఊహించిన స్థాయి సక్సెస్ రాలేదు. ఇకపై కథల విషయంలో కూడా దర్శి కేర్ తీసుకోవలసిన అవసరం ఉంది.
అయితే ఇప్పుడే షో పూర్తయింది కాబట్టి కొద్దిపాటి నెగిటివ్ కామెంట్స్ కనిపించడం అనేది సహజంగానే జరుగుతుంది. ఒక రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఈ సినిమా అసలైన రిజల్ట్ ఏంటో బయటకు వస్తుంది.
Also Read : Fauji : ప్రభాస్ సినిమా టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి