Sai Durga Tej: టాలీవుడ్ హీరో సాయి ధరంతేజ్(Sai Daram Tej) గురించి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ అల్లుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. మొదట పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.
సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇవ్వడంతో చాలా త్వరగానే సక్సెస్ అయ్యాడు సాయిధరమ్ తేజ్. ఇకపోతే ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. బైక్ లో నుంచి కింద పడిన సాయి ధరంతేజ్ చాలా రోజులపాటు హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చాడు. అలా కొన్ని నెలలపాటు సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత బ్రో(Bro) సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కూడా నటించిన విషయం తెలిసిందే.
బ్రో సినిమా తర్వాత మరే సినిమాలోను నటించలేదు సాయి తేజ్. ఇకపోతే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా సంబరాల ఏటిగట్టు(Sambarala Yetigattu). ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అయితే బ్రో సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడంతో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా మూవీ మేకర్ సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు.
కన్ఫర్మ్ అయ్యాక ఆపడం బాధేసింది..
ఈ గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ వీడియోకి అభిమానుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. అయితే ఈ గ్లింప్స్ వీడియో విడుదల చేసిన సందర్బంగా హీరో సాయి తేజ్ మాట్లాడుతూ.. బ్రో సినిమా తరువాత రెండు సినిమాలు ఆగిపోయాయి. అయితే అవి కన్ఫామ్ అయిన తర్వాత ఆగిపోవడం చాలా బాధేసింది. ఆ తర్వాత ఇలాంటి మంచి మూవీ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషపడ్డాను అని తెలిపారు సాయిధరమ్ తేజ్. అయితే ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Bunny vasu: పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను… బన్నీ వాసు మాస్ వార్నింగ్