Hrithik Roshan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan)ఇటీవల ఢిల్లీ హైకోర్టును(Delhi Heigh Court) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంతోమంది అభివృద్ధి చెందిన టెక్నాలజీని వారి స్వలాభం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ఫోటోలు వీడియోలను ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున లాభం పొందుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇలా కోర్టును ఆశ్రయించిన వారిలో నటుడు హృతిక్ రోషన్ ఒకరు.
హృతిక్ రోషన్ అనుమతి లేకుండా కొన్ని బిజినెస్ వెబ్ సైట్లు అలాగే ఈ కామర్స్ వెబ్ సైట్లు హృతిక్ రోషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో వాటిని తొలగించాలని కోరుతూ ఈయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు.. ఇలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నేడు పిటిషన్ విచారణ జరిగింది . విచారణ అనంతరం కోర్టు కీలక ఉత్తర్వులను జారీచేసింది. ఎవరైతే హృతిక్ రోషన్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలు వీడియోలను ఉపయోగిస్తున్నారో వెంటనే డిలీట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఇకపోతే హృతిక్ రోషన్ తరపు న్యాయవాది పిటీషన్ లో భాగంగా అభిమానులు కూడా హృతిక్ రోషన్ ఫోటోలు వీడియోలు వాడుతున్నారని వాటిని కూడా అదుపు చేయాలని కోరారు. అయితే ఈ విషయంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అభిమానులు కేవలం వారిపై ఉన్న అభిమానంతో మాత్రమే ఫోటోలను ఉపయోగిస్తున్నారు తప్ప ఎలాంటి లాభాన్ని ఆశించి కాదని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఈ విషయంపై అక్కినేని నాగార్జున, ఐశ్వర్య అభిషేక్ దంపతులు, దీపికా పదుకొనే వంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంలో హృతిక్ రోషన్ కి కూడా ఊరట లభించింది. హృతిక్ రోషన్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఓటీటీలో దూసుకుపోతున్న వార్ 2..
ఇటీవల ఈయన యశ్ రాజ్ ఫిలిం యూనివర్స్ నుంచి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో నటించిన వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లో ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్(Net Flix) లో ప్రసారం అవుతూ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) కూడా నటించిన విషయం తెలిసిందే. ఇలా థియేటర్లో ఈ సినిమా కాస్త ప్రేక్షకులను నిరాశపరిచిన ఓటీటీలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని నెంబర్ వన్ స్థానంలో స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read: Ahana Krishan: ఖరీదైన కారు కొన్న నటి… ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!