Ahana Krishan: మామూలుగా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చూసి మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా వారు ఉపయోగించే వస్తువులు, కార్లు, దుస్తులు, వాటి వివరాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. అభిమానులు ఆ విషయాలు తెలిసి షాక్ అవుతుంటారు. ఇకపోతే తాజాగా ఒక హీరోయిన్ కారు ధర తెలిసి ఆవాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఏ కారు కొనుగోలు చేసింది? ఆ కారు ధర ఎంత? అన్న వివరాల్లోకి వెళితే..
సినిమా ఇండస్ట్రీలో కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం అన్నది సర్వసాధారణం. కొన్ని సార్లు కోట్లు లక్షలు విలువ చేసే కార్లను బర్త్ డే గిఫ్టులుగా ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చుకుంది. ఆమె మరెవరో కాదు మలయాళ బ్యూటీ అహానా కృష్ణ(ahana Krishna). నేడు ఆమె పుట్టినరోజు కావడంతో ఒక సూపర్ లగ్జరీ కారు(luxury Car)ను కొనుగోలు చేసింది. BMW X5 కార్ ని కొనుగోలు చేసింది. అయితే ఇదే విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. ఈ మేరకు కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్బంగా ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది.
20’s నుంచి 30’s కి అడుగుపెడుతున్నందుకు కొంచెం బాధగానే ఉంది. కానీ ఈ కొత్త ఏజ్ కి వెల్కమ్ చెబుతున్నాను. లైఫ్ ఏం చేయాలి అనే విషయంలో నాకు మొన్నటి వరకు క్లారిటీ లేదు. సినిమాలు చేస్తుండగానే టైం గడిచిపోయింది. అలాగే జీవితంలో తనకు స్వేచ్ఛ ఇచ్చినందుకు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే ఆ కారు ధర గురించి వెతకడం మొదలుపెట్టారు నెటిజెన్స్. అయితే అహానా కృష్ణ కొనుగోలు చేసిన కారు ధర సుమారుగా 95 లక్షల నుంచి కోటి వరకు ఉంటుందని సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా అహానా కృష్ణ కేవలం సినిమాల ద్వారానే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి సీరియల్స్ లో నటిస్తూ బాగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె చివరగా కొత్త లోక : చాప్టర్ 1 సినిమాలో గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరిన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.