Bigg Boss 9 Day 38 Episode Highlights: ఈ రోజు బిగ్ బాస్ షో వాడివేడిగా సాగింది. మాధురి-సంజన, మాధురి-దివ్య, ఆయెషా-రీతూ మధ్య ఆర్గ్యూకి హౌజంత హీటెక్కింది. ఇదంత చూస్తుండే అసలు వైల్డ్ కార్డ్స్ వచ్చిందే గొడవలక అన్నట్టు అనిపిస్తోంది. మూడు రోజులు జంటగా ఉన్న సంజన, మాధురి గొడవ పడితే హౌజ్ మొత్తం ఎలా రియాక్ట్ అవుతుందా అని టెస్ట్ పెట్టాలకున్నారు వీరిద్దరు. ఇందుకోసం గొడవ పడినట్టుగా సీన్ క్రియేట్ చేశారు. ఇందుకోసం స్టిక్కర్ల సాకు పెట్టుకుని ఇద్దరు గొడవ పడ్డారు. ఇందులో మాధురి ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు సంజనపై విరుచుపడింది. ప్రాంక్ అయినా.. మాధురి మాత్రం అసలు తగ్గలేదు. సంజన దొంగ అని, వచ్చినప్పటి నుంచి దొంగతనం చేసి చేసి అలవాటైపోయిందా? అంటూ నచ్చినట్టుగా నోరుపారేసుకుంది.
మాధురి బూతు పురాణంకు తట్టుకోలేక సంజన చివరకు కట్ కట్ చెప్పి అసలు విషయం బయటపెట్టింది. ఆ తర్వాత ఎగ్ దోశ వల్ల దివ్య, మాధురి మధ్య హీటెడ్ ఆర్గ్యూమెంట్ జరిగింది. ఎగ్ దోశన కర్రీతో తిన్నందుకు దివ్య మాధురి ప్రశ్నించింది. నేను వండిన కర్రీ నా ఇష్టం వేసుకుంటానంటూ దురుసుగా సమాధానం ఇచ్చింది మాధురి. ఏంటీ గొడవ పడాలని చూస్తున్నావంటూ కయ్యానికి కాలు దువ్వింది. ఫుడ్ మానిటర్ నేనొక్కదాన్ని ఉన్న.. ఏం తినాలన్న తన పర్మిషన్ తీసుకోవాలని దివ్య గుర్తు చేసింది. దీంతో నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చేయండి, ఆమె నాతో మాట్లాడటం ఇష్టం లేదు అన్నప్పుడు నేను ఎలా మాట్లాడతానంటూ మాధురి మరోసారి నోరేసుకుని పడిపోయింది.
ఈ దెబ్బతో ఫుడ్ మానిటర్ మార్చేయండి అంటూ డిమాండ్ పెట్టింది. వైల్డ్ కార్డ్స్ దగ్గరికి వెళ్లి ఫుడ్ మానిటర్ ని మార్చమని చెప్పండి అంటూ నిరసన తెలిపింది. ఆ తర్వాత కెప్టెన్ పవన్ రంగంలోకి దిగి ఫుడ్ మానిటర్ మార్చడంపై అందరి రివ్యూ తీసుకున్నాడు. అంత దివ్యకే ఓటేశారు. ఇక హౌజ్ కాస్తా సైలెంట్ అయ్యింది. అప్పుడే మాధురికి బోర్ కొడుతుందట. హౌజ్ లో వరుసగా గొడవలు పడ్డ మాధురికి బోర్ కొట్టిందట. దీంతో అందరికి భరతనాట్యం నేర్పిస్తాను అంటూ అఖిల్, సాయి, ఆయెషా, ఇమ్మాన్యుయేల్, సంజనలకు టీచర్ గా మారింది.
ది.. తత్తై అంటూ భరత నాట్యం స్టెప్పులు నేర్పించింది. ఇక్కడ కూడా రాంగ్ స్టెప్స్ వేస్తున్న వారికి గట్టిగా వారిస్తూ స్టెప్పులు వేయించింది. ఇక్కడ కూడా మాధురి తన దురుసు తనమే చూపించింది. అదే టైంలో బిగ్ బాస్ ఆయెషాకి ఓ టాస్క్ ఇచ్చాడు. మొదటి బజర్ నుంచి మళ్లీ బజర్ మోగే వరకు హౌజ్ లో తెలుగు టీచర్ గా ఉండాలని, తెలుగు రాని గౌరవ్ కి తెలుగు నేర్చించాలని టాస్క్ ఇచ్చాడు. గౌరవ్ కి తెలుగు నేర్పించేందు గార్డెన్ ఎరియాలో ఆయెషా, ఇమ్మాన్యుయేల్, సాయి, సుమన్, సంజనలు కూర్చొన్నారు. ఇక్కడ అయెషా టాస్క్ అయితే ఇమ్మూనే ఎక్కువ హైలెట్ అయ్యాడు. ఆయెషా బదులుగా ఇమ్మూ తెలుగు టీచర్ అవతారం ఎత్తి గౌరవ్ కి పద్యాల నుంచి మాస్ డైలాగ్ వరకు తెలుగు నేర్పించాడు.
ఆ తర్వాత బెడ్ రూంలో తనూజ, దివ్యల మధ్య చిన్నపాటి మాటల యుద్దమే జరిగింది. వైల్డ కార్డ్స వచ్చాక తనూజ బిహెవియర్ మారిందని, ఇప్పుటి వరకు బాండింగ్ ఎమోషన్స్ అంటూ భరణితో ఉన్న తనూజ.. ఇప్పుడు ప్లేటు తిప్పిందని. టైం బీయింగ్ పర్సన్ అలాంటి వాళ్లను అస్సలు నమ్మొద్దని అంటుంది. మరోపక్క అయెషా, దివ్య, ఇమ్మాన్యుయేల్ గాసిప్ మొదలెట్టారు. తనూజ ఫుల్ మాస్క్ తో ఆడుతుందని, ఇప్పటి వరకు తన ట్రూ కలర్ బయటకు రాలేదంటూ అంటుంది అయెషా. ఆ తర్వాత రమ్యకు లగ్జరీ బడ్జెట్ కింద మరుసటి రోజుకి కావాల్సిన ఫుడ్ ని తననే సెలక్ట్ చేయమంటారు. బిగ్ బాస్ ఇచ్చిన ఈఅవకాశాన్ని వాడుకుని పెద్ద చిట్టానే ఇచ్చింది. ఎగ్ పెసరట్టు, ఐస్ క్రిం, నెయ్యి, చికెన్ జాయింట్ పీస్ బిర్యాని, గోల్డెన్ ఫ్రై ప్రాన్స్, బనానా, నాలుగు ట్రేల గుడ్లు ఇలా బారెడు చిట్టా ఇస్తుంది.
Also Read: Bigg Boss 9: దివ్య వర్సెస్ మాధురి.. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా, రీతూకి దివ్య మాస్ వార్నింగ్
కాసేపటి వంటి గదిలో ఆయెషా, రీతూల మధ్య పెద్ద యుద్దమే జరిగింది. హౌజంత సైలెంట్ గా ఉందని అనుకునేలోపే గిన్న తొమలేదంటూ ఆయెషా రీతూపై మాటల దాడికి దిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్దా వార్ జరిగింది. ఆయెషా నోటి వచ్చిన పాయింట్స్ పెడుతూ పెద్ద ఆర్గ్యూమెంట్ చేసింది. బౌల్ కడగమని అంటే ఇంతలా అంటుంది, తన పని తను చేయడం లేదంటూ ఆయెషా రీతూపై నోరేసుకుని పడిపోయింది. రీతూ మాత్రం అది అర్థరాత్రి వేశారని, అంతకు ముందే పెట్టి ఉంటే కడిగేదాన్ని అని వివరణ ఇచ్చుకున్న ఆయెషా వినలేదు. అంతకు ముందు డిమోన్ పవన్, ఆయెషాలు సల్సా డ్యాన్స్ తో అదరగొట్టారు. కపుల్ డ్యాన్స్ చూసి రీతూకి మండింది. అది ఆమె మొహంలో కనిపించింది.