Telusukada pre release: సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)హీరోగా నీరజ కోన (Neeraja kona) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తెలుసు కదా(Telusukada). ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా హీరో హీరోయిన్లతో పాటు ఇతర చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సిద్దు వేదిక పైకి వెళ్ళగానే అభిమానులతో మాట్లాడుతూ ఈరోజు నాకు చాలా బాధగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు. గత సంవత్సర కాలంగా నేను ఒక విభిన్నమైన వరుణ్ అనే పాత్రలో బ్రతుకుతున్నాను. అయితే రేపటితో ఆ పాత్రకు నేను గుడ్ బై చెప్పాల్సి వస్తోంది అంటూ ఈ సందర్భంగా తెలుసు కదా సినిమాలో వరుణ్ పాత్ర గురించి మాట్లాడుతూ ఈయన ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మాయిల గురించి అలాగే అబ్బాయిల గురించి కూడా సిద్దు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా అమ్మాయిల గురించి మాట్లాడుతూ.. ఆడవాళ్లు ఎప్పటికీ అందమైన వాళ్లు అంటూ అభివర్ణించారు.. అమ్మాయిల కోసం యుద్ధాలు జరిగాయి, మీకోసం కవితలు రాశారు . అసలు ఈ సృష్టి మొదలైందే అమ్మాయిల వల్ల.. అమ్మాయిల ముందు అబ్బాయిలు కేవలం నిమిత్త మాత్రులమే అంటూ చెప్పుకువచ్చారు. మేమేదైనా సరదాగా తెలిసి తెలియక తప్పులు చేసిన పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. అమ్మాయిలు గొప్పా అబ్బాయిలు గొప్పా అంటే అమ్మాయిలే గొప్ప మీ వల్ల మేము గొప్ప అంటూ అమ్మాయిల పట్ల ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడారు. అలాగే అబ్బాయిల గురించి కూడా మాట్లాడారు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెలుసు కదా..
అబ్బాయిలు అమ్మాయిల ప్రేమలో పడినప్పుడు ఎవరైనా మోసం చేసి వెళ్లిపోతే వారిని వెళ్ళిపోనివ్వండి అలా కాదని మీరు కూడా వారి వెనుక పడితే మీ మీద మీకున్న మర్యాద పోతుంది. ఇలా అమ్మాయిలు మోసం చేసి వెళ్లినప్పుడు మీలో నుంచి ఒకడు బయటకు వస్తాడు అప్పుడే అర్థమవుతుంది మన ఎమోషన్స్ ఎప్పుడు మన కంట్రోల్ లోనే ఉండాలి అంటూ ఈయన సినిమాలోని డైలాగ్ చెబుతూ అబ్బాయిలకు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఇక ఈ సినిమాలో వరుణ్ పాత్ర కూడా అలాగే ఉండబోతుందని సిద్దు చెప్పకనే చెప్పేశారు. ఇక తెలుసు కదా సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. డైరెక్టర్ నీరజ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా విభిన్నంగా తెరకెక్కించారని తెలుస్తుంది. జాక్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత తెలుసు కదా అంటూ సిద్దు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఈయనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Hrithik Roshan: ఢిల్లీ హైకోర్టులో హృతిక్ రోషన్ కు భారీ ఊరట… వెంటనే ఆ పని చేయాలంటూ!