Upasana: మెగా కోడలు ఉపాసన (Upasana) అభిమానులకు దీపావళి పండుగను పురస్కరించుకొని శుభవార్తను తెలియజేశారు. ఉపాసన మరోసారి తల్లి కాబోతోందనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఘనంగా ఈమె సీమంతపు వేడుకలను(Baby Shower Cermony) కూడా నిర్వహించినట్లు తెలియజేశారు. ఇలా ఉపాసన రెండవసారి కవల పిల్లలకు (Twin Babies) జన్మనివ్వబోతున్నట్లు కూడా మెగా కుటుంబ సభ్యులు వెల్లడించడంతో అభిమానుల ఆనందం కూడా డబుల్ అయిందని చెప్పాలి. ఇలా ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతోందనే విషయం తెలిసిన అభిమానులు కచ్చితంగా ఇద్దరు అబ్బాయిలే పుడతారని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సీమంతపు వేడుకలలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని సందడి చేశారు. నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి ఇద్దరు చెల్లెలు, సాయి ధరంతేజ్, వైష్ణవ్, నిహారిక, సుస్మిత వంటి వారందరూ కూడా సందడి చేశారు. అలాగే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. నాగార్జున దంపతులతో పాటు వెంకటేష్ దంపతులు, నయనతార దంపతులు కూడా ఈ సీమంతపు వేడుకలలో పాల్గొన్నారు. సెలబ్రిటీలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఉపాసన సీమంతపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మరి కొంతమంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఉపాసన సీమంతపు వేడుకలలో అందరూ సంతోషంగా కనిపించారు కానీ అల్లు కుటుంబం (Allu Family)మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఎన్నో సందేహాలను వ్యక్తపరిస్తున్నారు. మెగా కుటుంబంలో వేడుకకు అల్లు కుటుంబం దూరంగా ఉన్న నేపథ్యంలో వీరి మధ్య గొడవలు సర్దుమనగలేదా? ఈ రెండు కుటుంబాల మధ్య దూరం అలాగే ఉందా? అంటూ సందేహాలు వ్యక్తపరిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. కానీ ఇటీవల అల్లు నాగరత్నమ్మ మరణించడంతో ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయని అభిమానులు భావించారు.
బేదాభిప్రాయాలే కారణమా?
ఈ రెండు కుటుంబాల మధ్య అనుబంధం అల్లుకుపోయిందని అభిమానులు సంతోషపడేలోపు ఉపాసన సీమంతపు వేడుకలకు అల్లు కుటుంబం దూరం కావడంతో ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు కారణంగానే ఈ వేడుకలకు హాజరు కాలేదా? లేకపోతే మరి ఏదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక దీపావళి పండుగ రోజు అల్లు కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఘనంగా ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు కానీ, సీమంతపు వేడుకలకు మాత్రం దూరంగా ఉన్న నేపథ్యంలో మరోసారి మెగా అల్లు అభిమానులు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలు పెట్టారు.
Also Read: Shiva Re release: శివ రీ రిలీజ్..రంగంలోకి పుష్ప రాజ్ .. స్పెషల్ స్పీచ్ ఇవ్వనున్న బన్నీ!