అమృత్ సర్- సహర్సా మార్గంలో వారం రోజుల వ్యవధిలో మరో రైలులో మంటలు చెలరేగాయి. బీహార్ లోని సోన్ బార్సా కచాహ్రీ స్టేషన్ సమీపంలో జనసేవా ఎక్స్ ప్రెస్ రైలు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. వెంటనే స్పందించిన రైల్వే, పోలీస్ సిబ్బందితో పాటు స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. నీళ్ల బకెట్లతో రైలు వైపు పరుగులు తీస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపించింది. కాసేపట్లోనే మంటలు చెలరేగిన బోగీలను రైలు నుంచి ఏర్పాటు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.
అమృత్‌సర్ నుంచి సహర్సాకు ప్రయాణిస్తున్న జనసేవా ఎక్స్ ప్రెస్ రైలులోని ఒక కోచ్ మంటలు చెలరేగాయి. బీహార్ లోని సోన్‌బార్సా కచాహ్రీ స్టేషన్ సమీపంలోకి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు, రైల్వే సిబ్బంది కలిసి క్షణాల్లోనే మంటలు ఆర్పారు. ఆ తర్వాత రైలు సహర్సా స్టేషన్ కు సురక్షితంగా చేరుకుంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.
अमृतसर से सहरसा आ रही जनसेवा एक्सप्रेस की एक बोगी में सोनवर्षा कचहरी स्टेशन के पास अचानक आग लग गई ,रेल प्रशासन ने तुरंत कार्रवाई करते हुए आग पर काबू पा लिया. किसी के हताहत होने की सूचना नहीं है . #JansevaExpress #Fire #Train #Bihar pic.twitter.com/GuRhkarbYK
— Zee Business (@ZeeBusiness) October 24, 2025
అక్టోబర్ 18న, అదే అమృత్ సర్- సహర్సా మార్గంలో రగీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న తర్వాత, రైల్వే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలు చెలరేగిన కోచ్ లను వేరు చేసి, ప్రయాణికులను రక్షించారు. “ఉదయం 7:30 గంటల ప్రాంతంలో, అమృత్ సర్ నుండి సహర్సా వెళ్తున్న ఈ రైలు సిర్హింద్ స్టేషన్ నుంచి క్రాసింగ్ చేస్తున్నప్పుడు, మంటలు, పొగ కనిపించాయి. వెంటనే ఈ రైలును నిలిపివేశారు. 15-20 నిమిషాల్లో, మంటలు చెలరేగిన కోచ్‌లను రైలు నుంచి వేరు చేశారు. మంటలు వచ్చిన కోచ్‌ల నుంచి ప్రయాణికులను జాగ్రత్తగా రక్షించారు. ఒక ప్రయాణీకుడు 30-40% కాలిన గాయాలతో మరణించాడు. ఈ ఘటన కారణంగా ఫిరోజ్ పూర్ నుండి వచ్చే దాదాపు 6 రైళ్లు ప్రభావితమయ్యాయి. అంబాలా నుండి వచ్చే 2 ఇతర డివిజన్ల రైళ్లు కూడా ప్రభావితమయ్యాయి. అగ్నిప్రమాదానికి కారణం స్పష్టంగా లేదు. ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణ తర్వాత ఇది స్పష్టంగా తెలుస్తుంది” ఉత్తర రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ వినోద్ భాటియా వెల్లడించారు.
A major fire broke out in the Garib Rath Express travelling from Amritsar to Saharsa, just half a kilometre ahead of Ambala near Sirhind railway station.
No casualties reported.
pic.twitter.com/UHL6zYl1lV— With Love Bihar (@WithLoveBihar) October 18, 2025
అటు వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు ఈ మార్గంలో నడిచే రైళ్లలో మంటలు చెలరేగుతున్నాయనే అంశంపై లోతుగా విచారణ చేస్తున్నారు. త్వరలోనే అసలు వాస్తవాలు తెలిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: బస్సులో బతుకులు ‘బుగ్గి’.. ప్రమాదాల సమయంలో ఎదురవుతున్న అడ్డంకులు ఇవే!