Ramgopal Varma: ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Varma)సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చిన్న పోస్ట్ చేసిన క్షణాలు వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈయన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా (Spirit Movie)గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ప్రభాస్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ సినిమా నుంచి సందీప్ రెడ్డి ఆడియో టీజర్ విడుదల చేశారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాల నుంచి పోస్టర్లు విడుదల చేసిన అభిమానులకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు కానీ నిన్న రాత్రి ప్రభాస్ సినిమా గురించి సందీప్ రెడ్డి విడుదల చేసిన ఆడియో టీజర్ మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి.. సినిమాలో ఒక్క షాట్ కూడా కూడా చూపించకుండా, ఈ సినిమాలో నటీనటులను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ తో ఈ ఆడియో టీజర్ విడుదల చేయడంతో ఎంతో మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఈ అప్డేట్ పై రాంగోపాల్ వర్మ స్పందించి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
ఇక ఈ ఆడియో టీజర్ గురించి సందీప్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ట్వీట్ పై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ..” సందీప్ రెడ్డి నాకు నీ మంచి అలవాట్ల గురించి అలాగే ప్రభాస్ చెడ్డ అలవాట్ల గురించి తెలుసు.. మీ ఇద్దరి స్పిరిట్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ” వర్మ చేసిన ఈ క్రేజీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం స్పిరిట్ సినిమాకి సంబంధించిన ఈ ఆడియో టీజర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి ప్రయోగం చేయలేదని చెప్పాలి.
Hey @imvangasandeep I guess your GOOD HABIT is #Prabhas ‘s BAD HABIT 🔥HEARTY CONGRATS to the SOUND of both your SPIRIT ‘S 💪💪💪 https://t.co/NAMYiUveEF
— Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2025
సినిమాలో పాత్రలను పరిచయం చేయకుండా కేవలం ఆడియో ద్వారా సినిమాకు సంబంధించిన ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఈ ఆడియో టీజర్ చూస్తుంటే ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గాను అలాగే ఖైదీగా కూడా కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇక ఇందులో ప్రభాస్ కి జోడిగా నటి త్రిప్తి దిమ్రి(Tripti Dimri) నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్ వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో స్పిరిట్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
Also Read: The Raja Saab 2: రాజాసాబ్ కు సీక్వెల్ ..కొత్త డైరెక్టర్లకు కాస్త ఛాన్స్ ఇవ్వండయ్యా!