Sukumar: ప్రస్తుతం చాలామంది దర్శకులు తమకంటూ ఒక సొంత గుర్తింపు వచ్చిన తర్వాత సినిమాలు నిర్మించడం కూడా పనిగా పెట్టుకున్నారు. అయితే కొంతమంది దర్శకులు కొన్ని బ్యానర్స్ కు పరిమితం అయిపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లు తప్ప మరో బ్యానర్ లో సినిమాలు చేయరు. బయట బ్యానర్స్ లో తనకున్న కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కి పరిమితమై ఉండిపోయారు.
మరోవైపు సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ లో తప్ప మరో బ్యానర్ లో సినిమా చేయలేదు. ఇప్పటికీ కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే సుకుమార్ సినిమాలు చేస్తారు అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. తను మాత్రమే కాకుండా తను శిష్యులు చేసే సినిమాలకు కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఇన్వాల్వ్ అవుతుంది.
ఆల్రెడీ త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ తరఫున కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రెండు బ్యానర్స్ కలిపి సంయుక్తంగా చాలా సినిమాలను నిర్మిస్తాయి.
ఇప్పుడు సుకుమార్ వైపు కూడా అదే పంథాలో “తబిత సుకుమార్ ఫిలిమ్స్” అనే కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు. అయితే ఈ బ్యానర్ లో కుమారి 22 ఎఫ్ అని సినిమా మొదటగా రానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అప్పట్లో సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు కుమారి 22 ఎఫ్ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ నటించిన కుమారి 21 f సినిమా అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. ఆ సినిమాకి మంచి ఆదరణ కూడా లభించింది. సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన ఆ సినిమా తో సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. దేవి ఆ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.
అలానే బుచ్చిబాబు దర్శకుడుగా పరిచయమైన ఉప్పెన సినిమాకి కూడా అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. కేవలం సుకుమార్ సినిమాలకు మాత్రమే కాకుండా సుకుమార్ శిష్యులు చేసే సినిమాలకు కూడా దేవి మంచి మ్యూజిక్ ఇస్తాడు అని ప్రూవ్ చేసుకున్నాడు.
Also Read: Sharwanand: శర్వానంద్ షాకింగ్ లుక్, మరి ఇలా అయిపోయావ్ ఏంటి అన్న.?