BigTV English
Advertisement

NTR Dragon : ఆఫ్రికాకు ప్రయాణమవుతున్న ప్రశాంత్ నీల్, డ్రాగన్ పరిస్థితి ఏంటి?

NTR Dragon : ఆఫ్రికాకు ప్రయాణమవుతున్న ప్రశాంత్ నీల్, డ్రాగన్ పరిస్థితి ఏంటి?

NTR Dragon : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా గురించి అనేక రకమైన రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ దాని గురించి ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. వారిద్దరికీ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి అని చాలా వార్తలు వచ్చాయి. మరో స్క్రిప్ట్ పనిలో ప్రశాంత్ నీల్ పడిపోయాడు ఈ సినిమాను పక్కన పెట్టేసాడు అనే రేంజ్ లో కూడా కొంతమంది మాట్లాడారు.


ప్రశాంత్ నీల్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కే జి ఎఫ్ సినిమా తోనే ప్రశాంత్ సామర్థ్యం ఏంటో అందరికి అర్థం అయిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా చేసిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కం బ్యాక్ అయింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి మరోసారి ప్రశాంత్ ప్రభాస్ స్టామినా ఇంటూ రుజువు చేసింది.

ఆఫ్రికాకు ప్రయాణమవుతున్న ప్రశాంత్ నీల్

అయితే ప్రశాంత్ నీల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ నెల 27న Tunisia (ఆఫ్రికా) లోకేషన్స్ రెక్కీ కు వెళ్తున్నారు. తిరిగి నవంబర్ 3న రిటర్న్ అవ్వబోతున్నారు. ఒక సినిమా కోసం ప్రశాంత్ ఎంతలా కష్టపడతాడు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అద్భుతమైన లొకేషన్స్ ఉంటే అవుట్ ఫుట్ అంత బాగా వస్తుంది.


అందుకోసమే లొకేషన్స్ విషయంలో పర్టిక్యులర్ గా ప్రశాంత దృష్టి పెట్టారు. ప్రశాంత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత నవంబర్ 8 లేదా 10 నుండి హైదరాబాద్ లో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు. బరువు కూడా విపరీతంగా తగ్గిపోయారు. సినిమా కోసం ఎన్టీఆర్ ఏ రేంజ్ లో కష్టపడతారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

అఫీషియల్ టైటిల్ 

ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టారు అని ముందు ఎవరికీ తెలియదు. కానీ జపాన్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా గురించి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని రాజమౌళి చెప్పేసాడు. అక్కడితో డ్రాగన్ అని టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే టైటిల్ విషయంలో ఇప్పటివరకు అసలైన క్లారిటీ చిత్ర యూనిట్ ఇంకా ఇవ్వలేదు.

ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఎన్టీఆర్ అభిమానులు ఆశలన్నీ కూడా డ్రాగన్ సినిమా మీద ఉన్నాయి. అయితే ప్రశాంత్ నీల్ కచ్చితంగా అద్భుతమైన సినిమా తీస్తాడు అనే నమ్మకాలు కూడా విపరీతంగా చాలామందికి ఉన్నాయి. ఈ సినిమా 2026లో విడుదలవుతుంది. ఈ సినిమాతో పాటు భారీ సినిమాలు 2020 వరకు విడుదల కానున్నాయి.

Also Read: Peddi : పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదే, చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Related News

Baahubali The Epic Trailer : బాహుబలి తిరిగి వచ్చాడు, మైండ్ చెదిరిపోయే ట్రైలర్ కట్

Sukumar: కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన సుకుమార్ వైఫ్, కుమారి 22 F తో మొదలు

Sachin Sanghvi: మహిళపై లైంగిక వేధింపులు .. పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్

Megastar Chiranjeevi : 2026 లో మూడు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్

Upasana: ఉపాసన సీమంతపు వేడుకలలో కనిపించని అల్లు ఫ్యామిలీ.. మళ్ళీ దూరం పెరిగిందా?

Sharwanand: శర్వానంద్ షాకింగ్ లుక్, మరి ఇలా అయిపోయావ్ ఏంటి అన్న.?

Shiva Re release: శివ రీ రిలీజ్..రంగంలోకి పుష్ప రాజ్ .. స్పెషల్ స్పీచ్ ఇవ్వనున్న బన్నీ!

Big Stories

×