BigTV English
Advertisement

Megastar Chiranjeevi : 2026 లో మూడు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్

Megastar Chiranjeevi : 2026 లో మూడు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్

Megastar Chiranjeevi : భోళా శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు మెగాస్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒకటి కూడా విడుదల కాలేదు. ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ అంతకుముందు బాబి దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి లోని కామెడీ టైమింగ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా స్క్రీన్ పై ప్రజెంట్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు బాబీ.


బాబి కెరియర్లో సూపర్ హిట్ సినిమాలు ఉన్నా కూడా వాల్తేరు వీరయ్య తీసుకొచ్చిన పేరు ఇంకో సినిమా తీసుకురాలేదు. బాబీ స్టామినా ఏంటో తెలియజేసిన సినిమా వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ సినిమా దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అందుకే మళ్ళీ బాబి కు మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.

2026 లో మూడు సినిమాలు 

మెగాస్టార్ ని వెండి తెర మీద చూసి చాలా రోజులు అయిపోయింది. అయితే వచ్చే ఏడాది మాత్రం మెగా అభిమానులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏకంగా మూడు సినిమాలను 2026లో విడుదల చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు.


సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

వశిష్ట దర్శకత్వంలో చేసిన విశ్వంభర సినిమా కూడా 2026లో విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. షూటింగ్ దాదాపు పూర్తయిపోయినట్లే. అయితే రిలీజ్ విషయంలో ఎటువంటి కంగారు లేకుండా విఎఫ్ఎక్స్ అవుట్ పుట్ బాగా వచ్చిన తర్వాతే సినిమాను రిలీజ్ చేస్తాను అని వశిష్ట ఆల్రెడీ చెప్పుకొచ్చాడు. యు వి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది.

బాబీ సినిమా కూడా 

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా డిసెంబర్ నెలలో మొదలుకానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. మొత్తానికి ఆ సినిమాను పూర్తి చేసి 2026లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. డాకు మహారాజు సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు బాబి. వాల్తేరు వీరయ్య సినిమాతో అదిరిపోయే సక్సెస్ ఇచ్చిన బాబి ఈసారి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాడు అని చాలామంది మెగా అభిమానులు క్యూరియాసిటీ మొదలైంది.

Also Read: Sharwanand: శర్వానంద్ షాకింగ్ లుక్, మరి ఇలా అయిపోయావ్ ఏంటి అన్న.?

Related News

Baahubali The Epic Trailer : బాహుబలి తిరిగి వచ్చాడు, మైండ్ చెదిరిపోయే ట్రైలర్ కట్

Sukumar: కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన సుకుమార్ వైఫ్, కుమారి 22 F తో మొదలు

NTR Dragon : ఆఫ్రికాకు ప్రయాణమవుతున్న ప్రశాంత్ నీల్, డ్రాగన్ పరిస్థితి ఏంటి?

Sachin Sanghvi: మహిళపై లైంగిక వేధింపులు .. పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్

Upasana: ఉపాసన సీమంతపు వేడుకలలో కనిపించని అల్లు ఫ్యామిలీ.. మళ్ళీ దూరం పెరిగిందా?

Sharwanand: శర్వానంద్ షాకింగ్ లుక్, మరి ఇలా అయిపోయావ్ ఏంటి అన్న.?

Shiva Re release: శివ రీ రిలీజ్..రంగంలోకి పుష్ప రాజ్ .. స్పెషల్ స్పీచ్ ఇవ్వనున్న బన్నీ!

Big Stories

×