Sachin Sanghvi: ఇటీవల కాలంలో పలువురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు మహిళలపై లైంగిక వేధింపుల కారణంగా అరెస్ట్ అవుతూ జైలుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల క్రితం కోలీవుడ్ నటుడు అజ్మల్ అమీర్ మహిళల పట్ల అసభ్యకరంగా చాట్ చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈ వివాదం పై ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో ఏఐతో రూపొందించినదని, నాకు ఆ వీడియోకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని తెలిపారు. ఈ వివాదం మర్చిపోకముందే మరొక సింగర్ మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటంతో అరెస్ట్ అవ్వడం సంచలనం రేపింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా, కంపోజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సచిన్ సంఘ్వీ(Sachin Sanghvi ) ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కావడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది.. సచిన్ మ్యూజిక్ ఆల్బమ్ లో తనకు అవకాశం కల్పిస్తానని ఓ మహిళకు మాయ మాటలు చెప్పి ఆమెకు దగ్గర అవ్వడమే కాకుండా తన పట్ల లైంగిక వేధింపులకు (sexually assaulting)పాల్పడినట్లు తాజాగా మహిళ ఫిర్యాదులు పేర్కొన్నారు.
సచిన్ ఇంస్టాగ్రామ్ ద్వారా తనకు పరిచయమై తన మ్యూజిక్ ఆల్బమ్ ల అవకాశం ఇస్తానని చెప్పినట్లు ఈమె వెల్లడించారు. తద్వారా ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారని తెలుస్తోంది. ఇలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో మ్యూజిక్ స్టూడియోకి రావాలని సదరు మహిళలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యూజిక్ స్టూడియోలోనే ఆయన తనకు ప్రపోజ్ చేయడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇచ్చినట్లు మహిళ పేర్కొన్నారు. అయితే తనని తరచూ లైంగిక వేధింపులకు గురి చేస్తూ పలు సందర్భాలలో తనపై లైంగికంగా దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సదరు మహిళ లైంగిక వేధింపులు కింద కేసు నమోదు చేయడంతో పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు.
మౌనం వహిస్తున్న సచిన్ సంఘ్వీ..
ఇలా మహిళా చేసిన ఫిర్యాదును సింగర్ సచిన్ లాయర్ పూర్తిగా ఖండించారు . ఆమె చేసే ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై సింగర్ సచిన్ ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. మరి ఈ లైంగిక ఆరోపణల కేసులో భాగంగా సచిన్ ఇప్పటివరకు మౌనంగా ఉన్న నేపథ్యంలో సదరు మహిళ చేసిన ఆరోపణలు నిజమేనని కొందరు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. సచిన్ కెరియర్ విషయానికి వస్తే.. గత ఏడాది విడుదలైన స్త్రీ 2 సినిమాలో ఆజ్ కి రాత్ అనే పాటను ఆలపించారు. ఈ పాట మంచి సక్సెస్ అందుకుంది..ఇక తాజాగా జిగర్, థామా సినిమాలకు కూడా ఈయన సంగీతం అందించారు.
Also Read: Upasana: ఉపాసన సీమంతపు వేడుకలలో కనిపించని అల్లు ఫ్యామిలీ.. మళ్ళీ దూరం పెరిగిందా?