E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిల ఎంఎంఎస్ కుంభకోణం… అన్నీ అలాంటి కేసులే… సింగిల్‌గా ఉన్నప్పుడే చూడండి

OTT Movie : అమ్మాయిల ఎంఎంఎస్ కుంభకోణం… అన్నీ అలాంటి కేసులే… సింగిల్‌గా ఉన్నప్పుడే చూడండి
Advertisement

OTT Movie : ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎలా మోసపోతున్నారో, అది కూడా టెక్నాలజీతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎన్నోరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. జాగ్రత్తలు పాటించకుంటే, ఎలాంటి దారుణమైన ఇబ్బందుల్లో పడతారో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా మూడు వేర్వేరు కథలతో నడుస్తుంది. అన్నీ కథలు ప్రేమ, రొమాన్స్, మోసం గురించి కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఆధునిక సమాజంలో టెక్నాలజీ, ఎలా లైఫ్‌ను మారుస్తుందో కూడా చూపిస్తుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే 

‘LSD’ దిబాకర్ బానర్జీ డైరెక్ట్ చేసిన ఫౌండ్ ఫుటేజ్ సినిమా. ఇందులో నుష్రత్ భరుచ్చా (శృతి ), రాజ్‌కుమార్ రావు (రాహుల్), అంశుమాన్ ఝా (అదిత్య), నేహా చౌహాన్ (రష్మి), ఆర్య బెనర్జీ (నైనా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2010 మార్చి 19న థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం. Netflix, Amazon Prime Video, Youtube లో అందుబాటులో ఉంది. IMDbలో దీనికి 7.1/10 రేటింగ్ ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

స్టోరీ 1: రాహుల్ అనే యువకుడు, చిన్న బడ్జెట్ లో బాలీవుడ్ స్టైల్ సినిమాలు తీస్తుంటాడు. అతని సినిమాలో నటిస్తున్న హీరోయిన్ శృతి తో ప్రేమలో పడతాడు. వీళ్ళు షూటింగ్ టైమ్ లో ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ శృతి తండ్రి ఆమెకు కెనడాలో ఒక వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శృతి ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాహుల్, ష్రుతి ఇంటి నుండి పారిపోయి, రహస్యంగా పెళ్లి చేసుకుంటారు. కానీ శృతి సోదరుడు అతుల్ ఈ పెళ్లి గురించి తెలుసుకుని కోపంతో రగిలిపోతాడు. రాహుల్‌ పై సినిమా సెట్‌లో దాడి చేసి, శృతిని ఇంటికి తీసుకెళ్తాడు. ఆమె లైఫ్ బాగా డిస్టర్బ్ అవుతుంది.

స్టోరీ 2: అదిత్య ఒక వీడియో షాప్‌లో పని చేస్తుంటాడు. అతను రష్మి అనే అమ్మాయిని ఇష్టపడతాడు. రష్మి ఒక మాల్‌లో అటెండెంట్‌గా పనిచేస్తుంది. వాళ్లు ప్రేమలో కూడా పడతారు. ఇక ఫుల్ గా వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారు. అయితే రొమాంటిక్ మూమెంట్స్ మొబైల్‌లో రికార్డ్ చేసి, ఆ వీడియోను అదిత్య లీక్ చేస్తాడు. దీంతో రష్మి లైఫ్ నాశనం అవుతుంది. అదిత్య ఆ వీడియోను అమ్మి డబ్బు సంపాదిస్తాడు. రష్మి ఈ స్కాండల్‌ నుంచి బయట పడి, తన లైఫ్‌ను రీబిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది.

Advertisement

Read Also : బాబోయ్ ఇదేం సినిమా… పోలీస్ ఆఫీసర్ మర్డర్… కిల్లర్‌కే చెమటలు పట్టించే అమ్మాయి… కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీ 3 : నైనా అనే ఒక స్టింగ్ జర్నలిస్ట్, సెలబ్రిటీలను ట్రాప్ చేసి వీడియోలు తీస్తుంటుంది. ఆమె లోకేష్ అనే పాప్ సింగర్‌ను టార్గెట్ చేస్తుంది. నైనా, లోకేష్‌తో ఫ్రెండ్‌షిప్ చేసి, అతన్ని సెడ్యూస్ చేస్తుంది. రహస్యంగా ప్రైవేట్ వీడియో రికార్డ్ చేస్తుంది. నైనా ఆ వీడియోను టీవీ చానెల్‌కు అమ్ముతుంది. ఇక్కడ లోకేష్ కెరీర్ నాశనం అవుతుంది. ఈ కథ మీడియా మోసాలు, ఎథిక్స్ లేకపోవడం, టెక్నాలజీ దుర్వినియోగం వంటి అంశాలను హైలెట్ చేస్తుంది.

 

 

Related News

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఒకే ఇంట్లో రెండు తరాల ఘర్షణ… అవార్డ్ విన్నింగ్ బెంగాలీ క్లాసిక్ మాస్టర్‌పీస్

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

Big Stories

Advertisement
×