ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదికూడా ప్రపంచ సంతోషకర దేశాల జాబితా విడుదల అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ జీవన ప్రమాణాలు ఎలా పాటిస్తారో సమగ్రంగా పరిశీలించి ఈ లిస్టును రిలీజ్ చేస్తారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్.. గాలప్ అండ్ UN సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ సహకారంతో ప్రతి ఏడాది ప్రచురిస్తుంది. ఈ నివేదిక ఆరు కీలక సూచికల ఆధారంగా ఆయా దేశాల ప్రజల ఆనందాన్ని అంచనా వేస్తుంది. తలసరి ఆదాయం, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం, సోషల్ సపోర్ట్, లైఫ్ ఛాయిస్ పట్ల ఫ్రీడమ్, దాతృత్వం, అవినీతి పట్ల అవగాహన అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ లిస్టును తయారు చేస్తారు. తాజాగా విడుదల చేసిన లిస్టులో ఏ దేశం ప్రథమ స్థానంలో నిలిచింది? ఇండియా ఏ స్థానంలో ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం..
ఫిన్లాండ్ 2025 సంతోషకరమైన దేశాల లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. వరుసగా 8వ సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అక్కడి ప్రజలలో సామాజిక విశ్వాసం, సమగ్ర సంక్షేమ వ్యవస్థ, హై లెవల్ సివిక్ ఎంగేజ్ మెంట్ కారణంగా ఈ స్థానాన్ని సంపాదించుకుంది.
రెండో స్థానాన్ని డెన్మార్క్ దక్కించుకుంది. సమానత్వం, సమాజ భాగస్వామ్యం, బ్యాలెన్స్ డ్ లైఫ్ స్టైల్ ఆధారంగా ఈ ర్యాంక్ లో నిలిచింది.
ఐస్లాండ్ మూడవ స్థానంలో ఉంది. అక్కడి సమాజాల మధ్య ఉన్న దగ్గరి సంబంధాలు, అద్భుతమైన సహజ వాతావరణం, హై లెవల్ వెల్ బీయింగ్ కారణంగా మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ప్రొగ్రెసివ్ సోషల్ విధానాలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కారణంగా స్వీడన్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
మానసిక ఆరోగ్య అవగాహన, నాణ్యమైన విద్య అనేది నెదర్లాండ్స్ జాతీయ ఆనందానికి కారణం అయ్యింది. ఈ లిస్టులో 5వ స్థానాన్ని సంపాదించుకుంది. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో కోస్టారికా 6వ స్థానంలో, నార్వే 7వ స్థానంలో, ఇజ్రాయెల్ 8వ స్థానంలో, లక్సెంబర్గ్ 9వ స్థానంలో, మెక్సికో 10వ స్థానంలో నిలిచింది.
Read Also: అమెజాన్ డ్రైవర్లకు AI స్మార్ట్ గ్లాసెస్, ఇక ఆ పని చేయాల్సిన అవసరం లేదట!
మొత్తం 147 దేశాలను పరిశీలించి ఈ లిస్టును రూపొందించగా, భారత్ ఏకంగా 118వ స్థానాన్ని దక్కించుకుంది. మానసిక ఆరోగ్యం, ఆదాయ అసమానత, సామాజిక మద్దతును పొందడం లాంటి రంగాల్లో భారత్ సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ కారణంగా భారత్ 118వ స్థానాన్ని పొందినట్లు తెలిపింది. అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ముందుకెళ్తున్న భారత్.. హ్యాపీయెస్ట్ కంట్రీస్ 2025 లిస్టులో వెనుకబడి ఉండటం పట్ల చాలా మంది భారతీయులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Read Also: జాబ్ కోసం అమెరికా వెళ్లి.. గ్రీన్ కార్డు రాగానే రిజైన్ చేశాడు.. ఇప్పుడు రూ.24,079 కోట్లకు అధిపతి!