E-Paper
Advertisement

రామాయణ టీజర్.. ఏడేళ్ల కష్టానికి ప్రతిఫలం అంటూ డైరెక్టర్ పోస్ట్!

రామాయణ టీజర్.. ఏడేళ్ల కష్టానికి ప్రతిఫలం అంటూ డైరెక్టర్ పోస్ట్!
Advertisement

Nitesh Tiwari: తెరపై అద్భుతం సృష్టించాలి అంటే ఆ అద్భుతం వెనుక కష్టం ఎలా ఉంటుందో వెండితెరపై ఆవిష్కృతమవుతుంది. ఈ క్రమంలోనే రామాయణం ఇతిహాసాన్ని తెరపై మరింత అద్భుతంగా చూపించడానికి ఇప్పటికే ఎంతో మంది దర్శకులు ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి కథలను తెరపై ఎవరు ఎన్నిసార్లు ప్రదర్శించినా.. వాటిలోని కొత్తదనం ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి తెరపైకి రాబోతోంది రామాయణం. అందులో భాగంగానే సుమారుగా 4వేల కోట్లకు పైగా బడ్జెట్తో హాలీవుడ్ ప్రమాణాలతో.. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన గ్రాండీయర్ విజువల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ.

ఏడేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం..

ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రామాయణ చిత్రం నుండి రాముడి పాత్రను పరిచయం చేస్తూ చిన్న టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారీ ఒక ఎమోషనల్ పోస్టు పంచుకున్నారు. “రామాయణ కోసం సుమారుగా ఏడు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. చిత్రీకరణ సమయంలో ప్రతిక్షణం నాకు గుర్తుకొచ్చింది కేవలం ప్రేక్షకులు మాత్రమే.. సినిమా ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తూ సమయాన్ని గడిపాను.. అయితే ఈరోజు మీ అందరి రియాక్షన్ చూసిన తర్వాత.. నా ఎదురుచూపులకు తగిన ప్రతిఫలం లభించింది. ఆనందంతో కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి” అంటూ నితీష్ తివారీ తెలిపారు. ఇకపోతే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 10,000 మంది వర్క్ చేస్తున్నారని గతంలో చిత్రం బృందం ప్రకటించిన విషయం తెలిసిందే..మొత్తానికైతే ఏడేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని టీజర్ లోనే చూపించేశారు నితీష్ తివారీ.

Advertisement

also read:ప్రముఖ నటి సోనాలి బింద్రేపై కేస్ ఫైల్.. భూమిని లాగేసుకున్నారంటూ రైతు ఆవేదన!

రామాయణపై తన అభిప్రాయాన్ని పంచుకున్న రణబీర్ కపూర్

ఇదిలా ఉండగా మరొకవైపు రామాయణం ప్రాజెక్టులో భాగం కావడంపై నటుడు రణబీర్ కపూర్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటువంటి అద్భుతమైన చిత్రాలలో నటించాలని అనుకున్నాను.అయితే నేడు నా కల నెరవేరిందని స్పష్టం చేశారు. 2000 సంవత్సరం విజువల్ ఆర్ట్స్ కి సంబంధించి విదేశాలలో నేను శిక్షణ తీసుకున్నాను. అయితే ఒకసారి నా మిత్రుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? అమెరికాలోనే స్థిరపడి పనిచేయాలనుకుంటున్నావా ? అని అడిగాడు.. మా సంస్కృతి ,సాంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాతో నేను అమెరికాకు వస్తాను. అని చెప్పాను. అయితే నేడు నా మాటలు ఈ సినిమాతో నెరవేరాయి.. వాస్తవానికి నేను మొదట ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి ఆసక్తి చూపించలేదు. తండ్రిని అయ్యాక నా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. భయాన్ని వదిలి ధైర్యంగా ఈ సినిమాలో నటించడానికి నేను ముందుకు వచ్చాను అంటూ తెలిపారు. ఇకపోతే ఇందులో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తూ ఉండగా.. రావణుడిగా యష్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ రామాయణం చిత్రం నుండి మొదటి భాగం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×