E-Paper
Advertisement

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?
Advertisement

Anupama:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రెటీలు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా హింట్ రూపంలో లేదా నేరుగా అభిమానులతో పంచుకుంటున్నారు.. అది ప్రేమ విషయమైనా లేదా బ్రేకప్ అయినా.. ఏదైనా సరే ఇలా సోషల్ మీడియా ద్వారా ముందుగా హింట్ ఇస్తూ.. ఆ తర్వాత వాటిని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ పరమేశ్వరన్ కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన పోస్ట్ సరికొత్త అనుమానాలకు తెరలేపింది. ఎవరి అనుమతి అవసరం లేదు అంటూ చేసిన పోస్ట్ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది . మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అనుపమ బ్రేకప్ నిజమేనా?

అ ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ శతమానం భవతి సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లవుతున్నా .. ఏ రోజు కూడా ఆమె రూమర్స్ కి చోటు ఇవ్వలేదు. కానీ సడన్గా గత ఏడాది విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉందనే వార్త సోషల్ మీడియాలో జోరు అందుకుంది.అతనితో చనువుగా ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే ఇక అంతా బాగుంది.. పెళ్లికి సిద్ధమవుతున్నారు అనుకునే లోపే సడన్గా ఇంస్టాగ్రామ్ వేదికగా అనుపమ షేర్ చేసిన పోస్ట్ కొత్త అనుమానాలకు తెరలేపింది.

అలాంటి పోస్టుతో కొత్త అనుమానాలు..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకృతిలో హాయిగా విహరిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్న అనుపమ.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. “ఇక నుంచి నా గళాన్ని నేనే ఎంచుకుంటా.. ఎవరి అనుమతులు నాకు అవసరం లేదు.. ఇకపై ఎలాంటి భయం లేదు.. నేను మళ్లీ వచ్చేసాను” అంటూ అనుపమ చేసిన పోస్ట్ ఈ రూమర్స్ కి కారణంగా నిలుస్తోంది. అంతేకాదు తన ఇన్స్టాలో ధ్రువ్ ను అన్ ఫాలో చేయడంతో బ్రేకప్ నిజమేనని అభిమానులు కూడా అంటున్నారు. అలా మొత్తానికైతే అనుపమ పరమేశ్వరన్ – ధ్రువ్ విక్రమ్ బ్రేకప్ చెప్పుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో? ఎంత నిజమో ? తెలియాలి అంటే ఎవరో ఒకరు స్పందించక తప్పదు.

also read:Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

ఇద్దరి మధ్య ప్రేమ అక్కడే మొదలయ్యిందా?

Advertisement

ఇకపోతే వీరిద్దరి మధ్య ప్రేమ పుకార్లు పుట్టుకు రావడానికి కారణం బైసన్ మూవీ అనే చెప్పాలి. గత ఏడాది అక్టోబర్ 17న వీళ్లిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక గ్రామీణ యువకుడు ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ గా మారాలనే తన కలను నెరవేర్చుకోవడానికి తీవ్రమైన అడ్డంకులను, కుల వివక్షను ఎలా అధిగమించాడు అనే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ OTT వేదికగా పాన్ ఇండియా భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది . ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని , పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు రాగా.. ఇప్పుడు బ్రేకప్ వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×