Prashanth varma: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ(Prashanth Varma) గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈయన దర్శకత్వంలో తేజ హీరోగా నటించిన హనుమాన్(Hanuman) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో పలువురు నిర్మాతలు ఈయనకు ముందుగానే వందల కోట్ల రూపాయలు అడ్వాన్సులు చెల్లించారని అయితే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమాలు చేయకుండా ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ప్రశాంత్ వర్మపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదులు చేశారంటూ వార్తలు బయటకు వచ్చాయి.
ఇలా ప్రశాంత్ వర్మ పంచాయతీ ఫిలిం ఛాంబర్ వద్దకు వెళ్లడంతో ఈ విషయం కాస్త సినీ ఇండస్ట్రీలో చర్చలకు కారణం అయ్యింది. నిర్మాత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy)ఫిర్యాదు మేరకు హనుమాన్ సినిమా తర్వాత అజీరా మహాకాళి, జై హనుమాన్, సినిమాలను తమ నిర్మాణ సంస్థలోనే చేస్తానని చెప్పి పదికోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ తీసుకున్నారని, అయితే సినిమాలు చేయడం లేదు అంటూ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇలా ముందుగా అడ్వాన్స్ తీసుకొని సినిమాలు చేయని నేపథ్యంలో సుమారు 200 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం ప్రశాంత్ వర్మ చెల్లించాలని ఈయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మ మధ్య తలెత్తిన ఈ వివాదం పై ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ మౌనంగా ఉన్నారు. ఇక తన గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ఈ వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ.. కొన్ని మీడియా సంస్థలు అలాగే సోషల్ మీడియా , న్యూస్ చానల్స్ సరైన వార్తలను ప్రసారం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నిర్మాతలతో తలిచిన ఈ వివాదం తెలుగు ఫిలిం ఛాంబర్ డైరెక్టర్ అసోసియేషన్ వద్ద పరిశీలనలో ఉందని తెలిపారు. ఫిలిం ఛాంబర్ లో మాట్లాడిన మాటలు అన్ని కూడా బయటకు చెప్పడం సరైన పద్ధతి కాదని ప్రశాంత్ వర్మ తెలిపారు.
— Prasanth Varma (@PrasanthVarma) November 2, 2025
ప్రస్తుతం నా గురించి చేస్తున్న ఈ ఆరోపణలన్ని పూర్తిగా ఆ వాస్తవమని ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. నా విషయంలో జరుగుతున్న ఈ సంఘటనలను చూస్తుంటే ప్రతీకార చర్యలలో భాగమని ఈయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాకు తాను అభ్యర్థిస్తున్నానని ఈ విషయానికి సంబంధించి సరైన సమాచారాన్ని అందించకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ విచారణ పూర్తి చేసి నిజా నిజాలను వెల్లడించే వరకు ఈ వార్తలను ప్రచురించవద్దు అంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Premante Teaser: భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!