Premante Teaser: టాలీవుడ్ హీరో ప్రియదర్శి ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. గత నెల దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రియదర్శి(Priyadarshi) నటించిన మిత్రమండలి (Mithra Mandali)సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ పెద్దగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రియదర్శి, ఆనంది(Anandi) ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం “ప్రేమంటే”. (Premante)ఈ సినిమా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది పెళ్లి గురించి మీకు ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవా అంటూ హీరో హీరోయిన్ మధ్య సాగే సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లికి ముందు ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి తర్వాత తమ జీవితం ఇలా ఉండాలని కోరుకుంటారు. పెళ్లి తర్వాత అనుకోకుండా వచ్చే ఇబ్బందుల వల్ల ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు, అలకలు గురించి ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని ఈ టీజర్ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ టీజర్ చూస్తుంటే లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కిందని స్పష్టమవతుంది.
ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమాతో మరోసారి ప్రియదర్శి హిట్ అందుకోబోతున్నారని స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ (Navaneeth Sriram) అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా,సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ మంచి అంచనాలని పెంచేసాయి.
తాజాగా టీజర్ వీడియో విడుదల చేయడంతో ఈ టీజర్ కాస్త వైరల్ అవుతుంది. ఈ సినిమా విడుదలకు 20 రోజుల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మిత్రమండలి సినిమాతో నిరాశ ఎదుర్కొన్న ప్రియదర్శి ప్రేమంటే సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారు తెలియాల్సి ఉంది.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్ గా బన్నీ!