Ind vs Aus: 5 టీ-20 ల సిరీస్ లో భాగంగా హోబర్డ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టి-20లో టాస్ ఓడిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ కి దిగింది. ఈ క్రమంలో మూడవ టి-20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేశారు. ఆరంభంలో ఆస్ట్రేలియా బ్యాటర్లకు పెద్ద ఎదురు దెబ్బ తగిలినప్పటికీ.. టీమ్ డేవిడ్ {74}, స్టోయినీస్ {64} విధ్వంసకర హాఫ్ సెంచరీలతో మెరిసారు. మొదట హెడ్ {6}, ఆ తర్వాత ఇంగ్లీస్ {1} వికెట్లను కూల్చాడు అర్షదీప్ సింగ్.
Also Read: Ind vs sa final: టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే..?
అనంతరం వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 9వ ఓవర్ వరుస బంతుల్లో మిచెల్ మార్ష్ {11}, మిచెల్ ఓవెన్ {0} ని అవుట్ చేశాడు. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ.. టీమ్ డేవిడ్ మాత్రం తన మెరుపు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం 12.6 ఓవర్ వద్ద శివమ్ దూబే 5వ వికెట్ ని పడగొట్టాడు. ఆ తర్వాత స్టోయినీస్ {64} పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2, దూబె ఒక వికెట్ పడగొట్టారు.
187 పరుగుల భారీ లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు 3.3 ఓవర్ వద్ద దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ {25} వికెట్ని కోల్పోయింది. అనంతరం 15 పరుగులు చేసిన గిల్ ని నాథన్ ఎల్లిస్ పెవిలియన్ చేర్చాడు. ఇక 7.3 ఓవర్ వద్ద 76 పరుగులు చేసిన భారత్ తన మూడవ వికెట్ ని కోల్పోయింది. 24 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ ఔట్ అయ్యాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ తమ అద్భుతమైన బ్యాటింగ్ తో భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ {25}, గిల్ {15}, సూర్య కుమార్ యాదవ్ {24}, తిలక్ వర్మ {29}, అక్షర్ పటేల్ {17}, వాషింగ్టన్ సుందర్ {49*}, జితేష్ శర్మ {22*} పరుగులు చేశారు. ఈ క్రమంలో ముడవ వన్డేలో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది.
Also Read: Lara: గంభీర్ ఘోరమైన తప్పు చేస్తున్నాడు… టీమిండియాను దేవుడు కూడా కాపాడలేడు
వాషింగ్టన్ సుందర్ విద్వంసం:
భారత బ్యాటింగ్ లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, కీపర్ జితేష్ శర్మ తమ అద్భుతమైన ఆట తీరుతో భారత జట్టుకి విజయం అందించారు. వాషింగ్టన్ సుందర్ కేవలం 23 బంతుల్లో 49* పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్స్ లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఇక జితేష్ శర్మ 13 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వచ్చిన ప్రతీ బ్యాటర్ బౌండరీలు బాధడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడారు. దీంతో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. ఇక ఆస్ట్రేలియా జట్టులో టిమ్ డేవిడ్ కూడా మన బౌలర్లను ఉతికారేశాడు. అయినప్పటికీ భారత బ్యాటర్లు, ముఖ్యంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రాణించడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ మూడవ టి-20 లో విజయంతో సిరీస్ లో ఇరుజట్లు 1-1 తో సమంగా ఉన్నాయి.