Nelson -RamCharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం బుచ్చిబాబు సాన(Bucchi Babu Sana) దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు 60% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం శ్రీలంకలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన కూడా వెలవడింది.
ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోందని స్వయంగా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు వెల్లడించారు. ఇక ఈ సినిమా రంగస్థలం సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి సుకుమార్ సినిమా తర్వాత చరణ్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Deelip Kumar) డైరెక్షన్లో బిజీ కాబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా అనిరుద్ సంగీత దర్శకుడిగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ హీరోగా జైలర్ 2 పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు పూర్తి కావచ్చాయి ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నెల్సన్ దిలీప్ కుమార్ రామ్ చరణ్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారని సమాచారం. అయితే నెల్సన్ ఎన్టీఆర్(NTR) తో కూడా సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు రామ్ చరణ్ పేరు తెరపైకి రావడంతో ఎన్టీఆర్ తో నెల్సన్ చేయాల్సిన సినిమా మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
మరింత ఆలస్యంగా ఎన్టీఆర్ సినిమా..
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు ఈయన డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా తర్వాత దేవర 2, అనంతరం డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నారు ఇలా ఈ సినిమాలు పూర్తయిన తర్వాతనే నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఉంటుంది. ఇలా ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వెల్లడించబోతున్నట్టు సమాచారం. నెల్సన్ చివరిగా రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Also Read: Yellamma: ఎల్లమ్మ సినిమాపై అప్డేట్ ఇచ్చిన వేణు.. అడ్డంకులు తొలగిపోయినట్టేనా?