 
					Kidney Health: శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తంలోని విషపదార్థాలను.. వ్యర్థాలను వడపోసి.. వాటిని యూరిన్ రూపంలో బయటకు పంపుతాయి. అంతేకాకుండా.. రక్తపోటును నియంత్రించడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడడం వంటి కీలక పనులను నిర్వహిస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు.. మనం తీసుకునే డ్రింక్స్ కూడా చాలా ముఖ్యం. కొన్ని రకాల డ్రింక్స్ కిడ్రీల శుద్ధికి, వాటి పనితీరును మెరుగు పరచడానికి ఎంతగానో తోడ్పడతాయి. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే కొన్ని అద్భుతమైన డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్వచ్ఛమైన నీరు:
కిడ్నీ ఆరోగ్యానికి ప్రపంచంలోనే అత్యుత్తమమైంది నీరు. కిడ్నీలు పనిచేయడానికి, వ్యర్థాలను బయటకు పంపడానికి నీరు తప్పనిసరి.
రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల కిడ్నీలు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటాయి. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో.. అంతే కాకుండా టాక్సిన్‌లను సమర్థవంతంగా తొలగించడంలో సహాయ పడుతుంది. ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు మాత్రం.. డాక్టర్ సలహా మేరకు మాత్రమే నీటిని తీసుకోవాలి.
2. నిమ్మరసం :
నిమ్మరసం కిడ్నీలకు ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది.
సిట్రిక్ యాసిడ్: నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రంలో కాల్షియం స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉపయోగం: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగడం మంచిది.
3. అల్లం-పుదీనా టీ:
అల్లం, పుదీనా (మింట్) కలిపి తయారు చేసే హెర్బల్ టీ కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ: అల్లంలో ఉండే జింజెరోల్ వంటి సమ్మేళనాలు శరీరంలో.. ముఖ్యంగా కిడ్నీలలో ఏర్పడే మంటను తగ్గిస్తాయి.
డిటాక్స్: ఈ టీ మూత్ర మార్గాన్ని శుభ్రపరచడానికి.. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగు పరచడానికి కూడా సహాయపడుతుంది.
4. బార్లీ నీరు:
పురాతన కాలం నుంచి కిడ్నీ ఆరోగ్యం కోసం బార్లీ నీటిని ఉపయోగిస్తున్నారు.
డైయూరెటిక్: బార్లీ నీరు సహజంగానే కిడ్నీ పని తీరుకు మేలు చేస్తుంది. ఇది కిడ్నీల నుంచి టాక్సిన్‌లను, అదనపు ద్రవాలను బయటకు పంపుతుంది.
తయారీ: బార్లీ గింజలను నీటిలో ఉడికించి.. ఆ నీటిని వడకట్టి, రోజుకు ఒక గ్లాసు తాగడం మంచిది.
5. కీరదోస జ్యూస్:
కీరదోసకాయలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. కాబట్టి ఇది కిడ్నీలకు అద్భుతమైన డ్రింక్.
యూరిక్ యాసిడ్ నియంత్రణ: కీరదోస రసం శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా ఇది గౌట్, కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
హైడ్రేషన్: దీని అధిక నీటి శాతం కిడ్నీలను శుభ్రంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
తప్పకుండా దూరంగా ఉండాల్సిన డ్రింక్స్:
కిడ్నీ ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే కొన్ని డ్రింక్స్‌కు దూరంగా ఉండటం చాలా అవసరం:
కూల్ డ్రింక్స: వీటిలో అధికంగా ఉండే ఫాస్ఫరస్, చక్కెరలు కిడ్నీలపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి.
అధిక కెఫిన్: కాఫీ, టీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి కిడ్నీల పనితీరుకు ఆటంకం కలుగుతుంది.
ఆల్కహాల్: ఆల్కహాల్ కిడ్నీలపై భారం పెంచి.. వాటి శుద్ధి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
కిడ్నీల ఆరోగ్యానికి పైన తెలిపిన డ్రింక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే.. ఇప్పటికే మీరు ఏదైనా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లయితే. మీ ఆహారంలో లేదా తీసుకునే డ్రింక్స్ లో ఎలాంటి మార్పులు చేసేముందు నెఫ్రాలజిస్ట్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన పానీయాలు తీసుకోవడం ద్వారా మీ కిడ్నీలను పది కాలాల పాటు దృఢంగా ఉంచుకోవచ్చు.