Visakhapatnam News: డబ్బంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి.. ఎవరైనా సరే డబ్బులు వస్తున్నాయంటే.. ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ ఎవరైనా కష్టపడండి అంటే మాత్రం కాస్త ఆలోచిస్తారేమో కానీ.. డబ్బు మాత్రం ఫ్రీగా వస్తుంది. ఏదైనా మాయ చెంబు కానీ.. లేదంటే ఎక్కడైనా దొంగతనం చేయాలంటే మాత్రం ఎనర్జీ కూడా అంతే లెవల్‌లో వస్తుందని చెప్పవచ్చు.
అయితే ఇక్కడ మాయా చెంబు అని ఎందుకు చెప్పామంటే.. మనం చాలా సార్లు సినిమాల్లో అనేక సందర్భాల్లో చూసుంటాం. ఒక చెంబులో కానీ లేదంటే ఒక పెట్టలో కానీ, బిందెలో కానీ.. ఎన్నో దాంట్లో అక్షయ పాత్ర అంటూ వింటూ ఉంటాం.
అయితే ఒక మాయ చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు డబ్బులు వస్తాయంటూ.. కొందరు కేటుగాళ్లు ఓ మహిళను అదికూడా హై ప్రొఫైల్ ఉన్న మహిళను మోసం చేసి రూ.1.50 కోట్లు దోచుకున్నారు. ఏంటి షాక్ అవుతున్నారా..?
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒక డాక్టర్‌ను మోసం చేశారు. వాళ్ల దగ్గర ఒక మాయ చెంబు ఉందని దాంట్లో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతుందని.. కానీ దానికి కొంత పెట్టుబడి పెడితేనే ఆ చెంబు వర్కౌట్ అవుతుందని కూడా తనకి చెప్పారు. ఆ డాక్టర్ కి మరి ఏమైందో.. తన చదివిన చదువు, తనకున్న తెలివితేటలు ఎటుపోయాయో.. ఏంటో తెలియదు కానీ ఎన్నో అప్పులు చేసింది.. తన కున్న ఆస్తిలో కొంచెం అమ్మేసి దాదాపు రూ.1.50 కోట్లు ఇచ్చింది వాళ్లకి.
ఇప్పుడున్న ఆధునిక కాలంలో కూడా ఈ మాయా చెంబులు ఉన్నాయంటే.. నమ్మసఖ్యంగా ఉందా అని ఆలోచించకుండా.. ఆముగ్గురు చెప్పిన అన్ని మాటలు నమ్మేసి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం అమ్మేసింది.
ఎప్పుడైతే ఆ డబ్బులు ఇచ్చిందో ఆ ముగ్గురు పత్తాలేకుండా పోయారు. వాళ్లు తన దగ్గర ఒక్కటే కాకుండా.. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో చాలా మంది దగ్గర ఇలా మోసం చేశారని వార్తలు కూడా విన్నాం.
కేవలం వీళ్లే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు.. లేకపోతే వివిధ దేశాల్లో కావచ్చు.. ఇలాంటి సంఘటనలు మనం తరుచూ వింటూనే ఉంటాం. కొన్ని స్కీములు, స్కాముల ద్వారా డబ్బులు పోతున్నాయి. పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఒకటికి రెండు సార్లు సైబర్లు క్రైమ్ పోలీసులు చెబుతున్నా కూడా అసలు వినకుండా.. అత్యాసకు పోయి డబ్బులు ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు.
ఇక్కడ మనకి ఒక పాట కూడా గుర్తొస్తుంది. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం అయ్యింది అని. అంటే ఎందుకు సినిమాల్లో చూపిస్తున్నారు. నిజంజీవితంలో జరుగుతున్నాయి. చాలా వరకు మీడియా కూడా చెబుతూనే ఉంది. పోలీసులు కూడా ఎవార్నెస్ తీసుకొస్తున్నారు. అయినా చాలా మంది అత్యాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు.
ఈ ముగ్గురు కూడా అమాయికంగా ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారంటే మాత్రం అపోహ అనే చెప్పవచ్చు. హై ప్రొఫైల్ వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్లు బయటకు వచ్చి చెప్పుకోలేరు. మన స్టేటస్, అర్హత, వాళ్లకున్న పరువు ఎక్కడ పోతుందో అని.. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వరు కాబట్టి వాళ్లని టార్గెట్ చేద్దామనేది చాలా మంది మోసం చేసిన వారు, మోసగాళ్లు ఇదే ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు.
అయితే ప్రియాంకా విషయానికి వచ్చే సరికి అరకులో ఉన్న వీళ్లముగ్గురు ఆమెకు పరిచయం అయ్యారు. దగ్గరైన తర్వాత తమ దగ్గర చెంబు ఉందని.. ఆ చెంబుకి ఎన్నో పూజలు చేశామని.. ఇందులో ఎన్నో శక్తులు ఉన్నాయి.. డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని నమ్మించారు. చెంబు విలువ కూడా రెండు కోట్లకు పైగే పెట్టారు.
రెండు కోట్లకు మించి గనుక మాకు డబ్బులు ఇస్తే ఆ చెంబు మీ సొంతం.. కాకపోతే ముందుగానే మాకు సగం డబ్బులు ఇవ్వాలి అంటూ 1.50 కోట్లు తీసుకుని పరార్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆమెకు వారి ఆచూకి కూడా లభించలేదు. ఏం చేయాలో తెలియక.. ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక తనలో తానే నరకయాతన అనుభవించిందని చెప్పుకోవచ్చు. తను ఇందంతా జీర్ణించుకోలేక హుటాహుటినా పోలీస్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు కానీ ఈ భాగోతం మొత్తం బయటపడలేదు. పోలీసులు వెంటనే వివరాలు తీసుకుని వారిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి కొంత డబ్బుని, అలాగే ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఎవరైనా చెంబు ఉంది, బిందె ఉంది అని చెప్తే మోసపోకండి. ఎందుకంటే కష్టపడకుండా ఏ రూపాయి కూడా రాదు.. కష్ట పడితేనే ఆ రూపాయి మీ సొంతం అవుతుంది.