Rohit Sharma: ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ.. రెండవ వన్డేలో 72 రన్స్ తో కీలక నాక్ ఆడినప్పటికీ భారత జట్టు గెలుపు రుచి చూడలేకపోయింది. ఇక మూడవ వన్డేలో అద్భుతమైన సెంచరీతో రాణించాడు హిట్ మ్యాన్. దీంతో మూడవ వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన తరువాత రోహిత్ శర్మ కేవలం బ్యాటర్ గా అద్భుతంగా రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు {202}, సగటు {101} చేసిన ఆటగాడిగా నిలిచాడు.
విమర్శకులకు సమాధానం చెప్పిన రోహిత్:
వన్డే కెప్టెన్సీ కూడా పోయింది, ఇక రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నాడంటూ వస్తున్న విమర్శకులకు ఈ సిరీస్ లో రోహిత్ శర్మ తన బ్యాట్ తో గట్టి సమాధానం చెప్పాడు. సెంచరీ పూర్తి చేసి హెల్మెట్ కూడా తీయకుండా.. కేవలం బ్యాట్ పైకెత్తి సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ శర్మ బాధ్యతమైన ఇన్నింగ్స్ తో టీమిండియా ఈ మ్యాచ్ లో గెలుపొంది ఆస్ట్రేలియా చేతిలో వైట్ వాష్ కి గురికాకుండా తప్పించుకుంది.
రోహిత్ శర్మ హెయిర్ ప్లాంటేషన్:
3 వన్డే మ్యాచ్ సందర్భంగా సెంచరీ పూర్తి చేసిన తర్వాత కూడా రోహిత్ శర్మ ఎందుకు హెల్మెట్ తీయలేదని, గత కొంతకాలంగా అతడు ఎక్కడ కనిపించినా క్యాప్ తోనే దర్శనమిస్తున్నాడని, మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంలోనైనా, ఏదైనా ఎయిర్ పోర్టులో కనిపించిన సమయంలోనూ, ఫీల్డింగ్ చేసే సమయంలోను, మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా క్యాప్ తోనే కనిపిస్తున్నాడని.. ఇందుకు గల కారణం ఏంటని పలువురు సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది మాత్రం దానికి గల కారణం ఇదేనంటూ రోహిత్ శర్మని ట్రోల్ చేస్తున్నారు. అదేంటంటే.. చాలాకాలం క్రితం రోహిత్ శర్మ హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని రోహిత్ శర్మ ఇప్పటివరకు బహిరంగంగా ధ్రువీకరించలేదు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా హెల్మెట్ ధరించడం వల్ల అధిక చమట మరియు ఒత్తిడితో జుట్టు రాలడం అనేది సహజం. కానీ రోహిత్ శర్మ హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ఈ మూడవ వన్డేలో సెంచరీ చేసిన అనంతరం రోహిత్ శర్మ హెల్మెట్ తీయకపోవడానికి గల కారణం హెయిర్ ప్లాంటేషన్ అంటూ హిట్ మాన్ ని ట్రోలింగ్ చేస్తున్నారు. వైరల్ గా మారిన ఈ వీడియోని చూసిన హిట్ మ్యాన్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉపయోగపడే వీడియోలు చేయాలి కానీ.. ఇలా పని కట్టుకొని ఓ సీనియర్ ఆటగాడిని ట్రోల్ చేయడం ఏంటని మండిపడుతున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">