Husband Suicide: తన తల్లి ఇంట్లో ఉండటానికి భార్య ఒప్పుకోకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి 15వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హర్యాణాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు యోగేశ్ కుమార్(35), భార్య నేహా ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగులు. సుమారు తొమ్మిదేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం ఆరేళ్ల కూతురు ఉంది. ఉద్యోగబాధ్యతల కారణంగా చిన్నారిని చూసుకోవడంలో ఇబ్బందులు తెలెత్తడంతో.. యోగాష్ ఇటీవల తన తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు.
దీంతో అత్త కలిసి ఉండలేనని.. ఆమెను తిరిగి పంపించేయాలని భర్తతో తరుచూ వాగ్వాదానికి దిగేది. ఇటీవల ఈ విషయంపై ఇద్దరి మధ్య విభేదాలు రోజురోజుకీ పెరిగాయి. నేహా తన కుటుంబ సభ్యులతో కలిసి తరచుగా యోగేశ్‌పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఇంతలో యోగేశ్ తల్లి కూడా కుమారుడి పరిస్థితి చూసి తీవ్ర మనస్థాపానికి గురై.. ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అయినా కూడా యోగేశ్ తన తల్లిని పంపించలేదని, భార్యతో మధ్య మధ్యలో ఘర్షణలు జరిగాయని ప్రాథమిక విచారణలో తేలింది.
Also Read: కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. బైకర్ పై ఎర్రిస్వామి ఫిర్యాదు.. మద్యం కొనుగోలు వీడియో వైరల్
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యోగేష్ శుక్రవారం.. తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యోగేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నేహా సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.