Rohit Sharma Weight: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసే నాటికి అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్న రోహిత్ శర్మను చూసిన అభిమానులు 2027 ప్రపంచ కప్ వరకు ఫిట్నెస్ ఉంటుందా..? అని ఆందోళన చెందారు. నిజానికి రోహిత్ శర్మ ఒకింత బొద్దుగా ఉంటాడు. దానిని ఒబిసిటీ అనలేము. కానీ స్పోర్టింగ్ ఫిగర్ అయితే కాదని అంతా అనుకునేవారు. ఫిట్నెస్ అనుమానమే అని అంటారు. ఐపీఎల్ 2025 లో చివరిసారిగా అతడు కనిపించాడు. ఐపీఎల్ 2025 కొనసాగుతున్న సమయంలోనే టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పి.. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడి భారత్ ను విజేతగా నిలిపాడు. భారత జట్టులో చోటు సాధించాలంటే ఇప్పుడు బీసీసీఐ కఠినమైన ఫిట్నెస్ పరీక్షలు పెట్టింది.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు భయంకరమైన వ్యాధి.. అందుకే సెంచరీ తర్వాత కూడా హెల్మెట్ తీయలేదా ?
యో-యో టెస్ట్ తో పాటు బ్రాంకో టెస్ట్ కూడా ప్రవేశపెట్టింది. ఆ టెస్టుల్లో పాస్ అయితేనే జట్టులో చోటు అనడంతో రోహిత్ శర్మ భారీగా బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. బొద్దుగా, లావుగా ఉండే రోహిత్ శర్మ ఉన్నట్టుండి ఇంత సన్నగా ఎలా మారిపోయాడు అంటూ ఆయన అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ కి ముందు సియాట్ అవార్డ్స్ ఫంక్షన్ కి స్లిమ్ గా మారిన రోహిత్ శర్మను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ కి జెర్సీ నెంబర్ 45 లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నారు.
రోహిత్ శర్మ ఫిట్నెస్ పై అభిషేక్ నాయర్:
అతడి ఫిట్నెస్ పై రోహిత్ శర్మ చిరకాల మిత్రుడు అభిషేక్ నాయక్ స్పందిస్తూ.. ” రోహిత్ శర్మ వెయిట్ లాస్ జర్నీ మరింతకాలం కొనసాగుతుంది. అతడు గత మూడు నెలల్లో 11 కిలోల బరువు తగ్గాడు. తనకు ఇష్టమైన ఆహారాన్ని వదిలేశాడు. దాని ఫలితాలు ఈ సిరీస్ లో కనిపించాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్ కి మరింత సమయం ఉంది. అప్పటికల్లా మరింత బరువు తగ్గి కనిపించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు” అని తెలిపాడు అభిషేక్ నాయర్. అయితే తన ఫిట్నెస్ కోసం రోహిత్ శర్మ రోజు ఉదయం 3:30 గంటలకే నిద్రలేస్తున్నాడని.. అత్యధిక రిపిటేషన్లతో బాడీ బిల్డింగ్ స్థాయిలో చెమటోడుస్తున్నాడని తెలిపాడు. అలాగే ప్రతి సెషన్ లో 20 నిమిషాలు క్రాస్ ఫీట్ ట్రైనింగ్ చేస్తున్నాడు.
రోహిత్ శర్మ డైట్:
ఇక డైట్ విషయానికి వస్తే.. ఉదయం లేచిన వెంటనే ఆరు నానబెట్టిన బాదం పప్పులు, సలాడ్ జ్యూస్ తాగడం, తాజా పండ్లతో కూడిన ఓటు మిల్క్ తో పాటు ఓ గ్లాస్ పాలతో సరిపెట్టుకుంటున్నాడట. ఇక మధ్యాహ్నం వెజిటేబుల్ కర్రీస్, అన్నం, పప్పు, సలాడ్ లాగించేస్తాడు. అలాగే సాయంత్రం డ్రై ఫ్రూట్స్, రాత్రి కూరగాయల పలావ్, పడుకునే ముందు గ్లాస్ పాలు. ఇది రోహిత్ శర్మ డైట్ అండ్ స్లిమ్ సీక్రెట్. ఈ క్రమంలో వన్డే ప్రపంచ కప్ 2027 టోర్నీ నాటికి రోహిత్ శర్మకి 40 ఏళ్ళు వస్తాయి. దీంతో ఇప్పుడు రోహిత్ శర్మను చూసిన ప్రతి ఒక్కరూ మరో రెండు సంవత్సరాలు ఏంటి.. నాలుగు సంవత్సరాలయినా సరే ఆడేలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.