OTT Movie : అజిత్ హీరోగా ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘విడాముయార్చి’. ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ అభిమానులను ఎంత గానో ఆకట్టుకుంది. ఆసక్తికరంగా సాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉంటుంది. ఇందులో రెజీనా కెసాండ్రా యాక్టింగ్ కూడా సినిమాకి ప్లస్ గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తెలుగులో ‘పట్టుదల’ పేరుతో రిలీజ్ చేశారు. అయితే తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను, తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఓటీటీలో మాత్రం అందరూ ఓ లుక్ వేస్తున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘విదాముయర్చి’ (Vidaamuyarchi) 2025లో వచ్చిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ కుమార్, త్రిషా కృష్ణన్, అర్జున్ సర్జా, రెజెనా కాసాంద్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2 గంటల 30 నిమిషాలు. 2025 ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల అయింది. మార్చి 3 నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ అయింది. ఐయండిబిలో దీనికి 6.2/10 ఉంది.
అర్జున్ (అజిత్ కుమార్) కయల్ (త్రిషా కృష్ణన్) అనే దంపతులు వైవాహిక జీవితం అంత సవ్యంగా ఉండదు. వీళ్ల వివాహం మరింత బలపడాలని, కొత్త జీవితం మొదలెట్టాలని అనుకుంటూ, ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్తారు. రోడ్ ట్రిప్ మధ్యలో వాళ్లు ఒక చిన్న రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తారు. అక్కడ ఒక చిన్న గొడవ జరుగుతుంది. కానీ అది సమాసిపోయిందనేలోగా, ట్రిప్ మధ్యలో కయల్ ఒక్కసారిగా మిస్సింగ్ అవుతుంది. దీంతో కంగారు పడిన అర్జున్ ఆమెను వెతుకుతూ ఉంటాడు. ఆమె ఫోన్ కూడా ఆఫ్ లో ఉంటుంది. అర్జున్ పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. కానీ వాళ్లు సీరియస్‌గా తీసుకోరు.
Read Also : చీమలు దూరని చిట్టడవిలో ట్రాప్… 100 ఏళ్ళ దెయ్యాల రివేంజ్‌కు బలి… కల్లోనూ వెంటాడే హర్రర్ కథ