Suryakumar Yadav: టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ హెల్త్ అప్డేట్ ఇచ్చాడు టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు.. శ్రేయాస్ అయ్యర్ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని సూర్య కుమార్ యాదవ్ ( Surya kumar Yadav) తాజాగా వెల్లడించారు. దీంతో సూర్య కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రిలో ఉన్న తరుణంలో టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడన్నారు. తనతో చాటింగ్ చేస్తున్నారని వెల్లడించారు. ఫోన్ కూడా చేసి మాట్లాడనని చెప్పుకొచ్చారు సూర్య. ఫోన్ లో మాట్లాడి, తన ఆరోగ్యం గురించి చెబుతున్నాడంటే, శ్రేయాస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నాడనే అర్థం అని చెప్పారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి వస్తాడని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు సూర్య కుమార్ యాదవ్. శ్రేయాస్ అయ్యర్ ఒక వీరుడు… అతనికి ఎలాంటి సమస్య ఉండదు.. త్వరలోనే మాతో కలుస్తాడన్నారు. శ్రేయాస్ అయ్యర్ హెల్త్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav).
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డే సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు శ్రేయాస్ అయ్యర్. అతని పక్కటెముకల దగ్గర బ్లీడింగ్ వస్తుందట. బ్లీడింగ్ రావడమే ఇక్కడ ప్రమాదకరమైన విషయం. దీంతో సిడ్నీలోని ప్రముఖ ఆసుపత్రిలో శ్రేయాస్ అయ్యర్ చికిత్స పొందుతున్నారు. దాదాపు మూడు రోజుల పాటు ఐసీయూలో ఉన్న శ్రేయాస్ అయ్యర్, నిన్నటి రోజున జనరల్ వార్డులోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అక్కడ ప్రత్యేక రూమును శ్రేయాస్ అయ్యర్ కోసం కేటాయించారట. ఇక శ్రేయాస్ అయ్యర్ కోసం ప్రత్యేకంగా డాక్టర్ ను కూడా నియామకం చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం గురించి అనునిత్యం ఆ డాక్టర్ పరిశీలన చేస్తున్నారట. అదే సమయంలో ఇండియా నుంచి శ్రేయాస్ అయ్యర్ ఫ్యామిలీని సిడ్నికి పంపించారు. ఇక సిడ్నికి చేరుకున్న శ్రేయాస్ అయ్యర్ ఫ్యామిలీ… అతన్ని దగ్గరుండి చూసుకుంటోంది. మరో వారంలో రోజుల్లోగా శ్రేయాస్ అయ్యర్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. కాగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ నేపథ్యంలోనే శ్రేయాస్ అయ్యర్ కు వైస్ కెప్టెన్సీ దక్కింది.
💙 SURYA KUMAR YADAV ON SHREYAS IYER 💙
“Shreyas is a fighter. I’m confident he’ll come back stronger from this injury. The whole team is supporting him and wishing him a speedy recovery.” 🙏🔥#ShreyasIyer #SuryakumarYadav #TeamIndia #GetWellSoonShreyas pic.twitter.com/eB6FzApxY2
— Rana Ahmed (@RanaAhmad056) October 28, 2025