వంటల విషయంలో ఆడాళ్లు చేసే ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగాళా బౌ బౌ. అరటిపండు లంబా లంబా కూడా వండేయగలరు. తాజాగా ఓ మహిళామణి కూడా ఓ అద్భుతమైన వంటకం చేసింది. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకీ దాని పేరు ఏంటంటే.. లౌకి చప్పల్ పకోడీ. మీరు విన్నది నిజమే.. లౌకి అంటే సొరకాయ, ‘చప్పల్’ చెప్పు ఆకారంలో ఉన్న పకోడీ. ఇంకా అర్థం కాలేదు. చెప్పు ఆకారంలో ఉన్న సొరకాయ పకోడీ. గత కొద్ది రోజులు గా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో ఓ మహిళ కూరగాయలను కోస్తున్నట్లు కనిపిస్తుంది. చివరికి అది చెప్పులా కనిపిస్తుంది. ఓ మహిళ సొరకాయ తీసుకుని నెమ్మదిగా కట్ చేస్తుంది. సొరకాయను చెప్పుకింది పాదంలా తయారు చేస్తే, పొట్టును నాడలుగా మార్చుతుంది. వాటిని అతికించేందుకు టూత్ పిక్స్ ను ఉపయోగించింది. ఆ చెప్పును శనగపిండిలో ముంచి నూనెలో వేయిస్తుంది. నెమ్మదిగా అది కుక్ అయిన తర్వాత పూర్తిగా చప్పుల పకోడీగా మారుతుంది. దాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకొని, దానికి కాస్త కెచప్ యాడ్ చేశారు. ఫోర్క్ తో ఆ చెప్పుల పకోడీనికి కట్ చేసి టామాట సార్స్ లో ముంచుకుని తింటూ మైమరిచిపోతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ‘ఇన్ స్టామార్ట్’ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఈ పోస్ట్ 125K కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది ఈ వీడియోను ‘సృజనాత్మకత’గా అభివర్ణిస్తే, మరికొంత మంది ‘ఆహారం పట్ల అగౌరవం’ అని కామెంట్స్ పెడుతున్నారు. “ఇంత కష్టపడటం ఏంటి? డైరెక్ట్ గా చెప్పులు తింటే సరిపోతుంది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఈ రకమైన క్రియేటివిటీ భారతీయులకు మాత్రమే సొంతం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “కొన్ని లైక్‌ల కోసం ఆహారాన్ని అగౌరవపరచవద్దు. మీ కంపెనీ కిరాణా సామాగ్రిని అమ్ముతుంది. చాలా మంది ప్రజలు వాటిని కొంటారు. మీరు అలా ప్రవర్తించడం మంచిది కాదు” అని మరో వ్యక్తి వెల్లడించారు. “ఈ వంటకాన్ని చూసిన తర్వాత ఏం చెప్పాలో తెలియడం లేదు. కానీ, సృజనాత్మకతకు పూర్తి మార్కులు చేస్తున్నాను” అని మరొక వ్యక్తి వెల్లడించారు. మొత్తంగా ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: వోడ్కాతో పానీపూరీ, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Read Also: సీజన్‌తో పనిలేదు.. ఈ బామ్మ దగ్గర 365 రోజులు మామిడి పండ్లు దొరుకుతాయ్, అందుకు ఏం చేస్తోందంటే?