Brahmamudi Appu : బులితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.. అందులో స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. బ్రహ్మ ముడి పడిన తర్వాత ఆ జంట విడిపోవడం కష్టం.. అనే స్టోరీ లైన్ తో ఈ సీరియల్ను తెరకెక్కించారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకే కుటుంబానికి కోడలుగా వస్తారు. ఆ తర్వాత ఎదురవుతున్న పరిస్థితుల బట్టి సీరియలు అనేక ట్విస్టులతో ముందుకు సాగుతుంది. ఈమధ్య ఈ సీరియల్ స్టోరీ కాస్త డౌన్ అయిందని టాక్ కూడా వినిపిస్తుంది. ఇకపోతే ఈ సీరియల్ లో మూడవ కోడలుగా నటించిన అప్పు పాత్రలో నైనిష రాయ్ నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన లైఫ్ లో ఎదురక్కొన్న దయనీయ స్థితిని వివరించి అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఆమె లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి ఆమె ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం…
బ్రహ్మముడి సీరియల్ లో దుగ్గిరాల కుటుంబం మూడో కోడలుగా అప్పు అలియాస్ నైనిష నటించింది. ఈ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈవెంట్లలో నైనీషా పాల్గొంటుంది.. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. మొదట్లో హైదరాబాద్కు వచ్చినప్పుడు ఒక జాబ్ చేసేదాన్ని.. కాలినడకన నడుచుకుంటూ వెళ్లి మరి ఆఫీస్ కి వెళ్లేదాన్ని.. ఇప్పుడు నాకు ఆ రోడ్డును చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది అని ఆమె అన్నారు. అప్పట్లో తిండి తినడానికి డబ్బులు లేక నా రక్తాన్ని అమ్ముకొని ఆ డబ్బులుతో నేను భోజనం చేశాను అని అప్పు అందరి చేత కన్నీళ్లు పెట్టించేసింది.. ఎన్నోసార్లు చనిపోవాలని అనుకున్నాను. షూటింగ్స్ జరిగేటప్పుడు బాగా ఫుడ్ పెట్టమని మాత్రమే అడిగేదానిని.. అన్నింటికి అడ్జెస్ట్ అవుతున్నానను కదా అని ప్రొడక్షన్ వాళ్లకి చీప్‌గా కనిపిస్తామని అనుకుంటారు. ఆ తప్పు ఎవరు చేయకూడదు అని ఆమె తన లైఫ్ గురించి షేర్ చేసుకుంది.
Also Read : జైలుకు ధీరజ్.. భాగ్యంకు షాకిచ్చిన నర్మద.. చేతులెత్తేసిన లాయర్..
నేను యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. చదువుకోవడానికి హైదరాబాద్‌లో ఉన్నాను., అయితే మా ఫ్రెండ్ ద్వారా ఒక ప్రొడ్యూసర్ నన్ను చూసి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌లో విలన్‌గా ఛాన్స్ ఇచ్చారు.. ఆ సీరియల్ మంచి హిట్ అవడంతో నాకు ఆ తర్వాత వరుసగా సీరియల్ లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే కొన్ని సీరియల్స్ కి ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కమిట్మెంట్ అడిగారు. అప్పట్లో నాకు కమిట్మెంట్ అంటే బాగా చదవడం పైకి రావడం అనే మాటలు మా తప్ప వేరేటివి తెలియదు. శ్రీ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత దీని గురించి నేను కూడా నాకు ఎదురైన పరిస్థితులను బయటపెట్టాలని అనుకున్నాను. కానీ భయంతో ఆగిపోయాను. ఇప్పుడు వాళ్లకి నేను ఆ కమిట్మెంట్ ఇవ్వకపోవడంతోనే నన్ను టార్గెట్ చేశారు. తర్వాత కొన్ని ఏళ్లు నాకు అవకాశాలు రాకుండా చేశారు. ఇప్పుడు నా కాళ్ల మీద నేను నిలబడ్డాను అని ఆమె అంటున్నారు.. బెంగాల్ నుంచి హైదరాబాద్ కి తాను వచ్చిన విషయాన్ని, ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి నైనిష ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. మొత్తానికి ఆ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది ఆమె పరిస్థితిని విని బాధపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈమె బ్రహ్మముడి సీరియల్ తో పాటుగా మరో సీరియల్ లో నటిస్తుంది..