PuriJagannadh -Bucchibabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh)ఒకరు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీనీ ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ ఏలారని చెప్పాలి. అప్పట్లో పూరి సినిమాలు వస్తున్నాయి అంటే బాక్సాఫీస్ షేక్ అయేదని చెప్పాలి. ఎంతో విభిన్నంగా పూరి జగన్నాథ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా టాలీవుడ్ హీరోలు అందరికీ కూడా బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు.
పూరి మార్క్ చూపించలేకపోతున్నారా?
ఇలా ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఏలిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. గత కొంత కాలంగా ఈయన చేస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశకు గురి చేస్తున్నాయి. ఇటీవల రామ్ హీరోగా నటించిన డబల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్ ఈ సినిమా ద్వారా నిరాశను ఎదుర్కొన్నారు .ప్రస్తుతం విజయ సేతుపతి(Vijay Sethupathi)తో మరో సినిమాకు కమిట్ అయ్యారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.
ఇద్దరిదీ ఒకే ఊరా…
ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ అలాగే ఇండస్ట్రీలో మరో దర్శకుడుగా కొనసాగుతున్న బుచ్చి బాబు(Bucchi Babu)కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈయన దర్శకుడిగా ఉప్పెన(Uppena) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. మొదటి సినిమా సక్సెస్ కావడంతో తన రెండవ సినిమా కూడా మెగా హీరో రామ్ చరణ్(Ram Charan) తో చేసే అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఈయన పెద్ది (Peddi)అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఇలా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా పూరి జగన్నాథ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన ఈయన పూరి జగన్నాథ్ తో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.”మా ఇద్దరిదీ పిఠాపురమే.. మేమిద్దరం ఒకే హాస్పిటల్లో జన్మించాము, ఇది దేవుడు రాసిన రాత… ఇదే విధి.. ఇప్పుడు మేమిద్దరం కూడా సినిమా రంగంలో డైరెక్షన్ అనే మార్గంలో ఇలా కలిసి ప్రయాణం చేస్తున్నాము అంటూ చెప్పుకు వచ్చారు. ఇలా వీరిద్దరిది ఒకే ఊరు ఒకే హాస్పిటల్లో జన్మించారనే విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు బయట పెట్టడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇలా ఇద్దరిది ఒకే ఊరు ఆయనప్పటికీ ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎక్కడ బయట పెట్టలేదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా ఇద్దరు ఒకే ఊరు, ఒకే హాస్పిటల్లో జన్మించి, ఇద్దరు కూడా డైరెక్టర్లు కావటం అనేది నిజంగా దేవుడు రాసిన రాత అని చెప్పాలి.
Also Read: Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే చాలు.. మీరే కంటెస్టెంట్ కావచ్చు?