Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss Season 9) తెలుగు ప్రసారానికి సర్వం సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి ఒక ప్రోమో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమోలో భాగంగా లోగో రివీల్ చేయటమే కాకుండా ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ ఈ కార్యక్రమం పై పెద్ద ఎత్తున అంచనాలను క్రియేట్ చేస్తూ ఒక ప్రోమో వీడియోని విడుదల చేశారు. తాజాగా మరొక వీడియోని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేశారు. ఇక ఈ ప్రోమో కాల్ ఫర్ ఎంట్రీస్(Call For Entries) అంటూ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారికి ఒక మంచి అవకాశం కల్పించారని చెప్పాలి.
బిగ్ బాస్ రిటర్న్ గిఫ్ట్..
ఈ వీడియోలో భాగంగా సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారని తెలుస్తోంది. ఈ వీడియోలో నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ.. బిగ్ బాస్ షోని ఎంతో ప్రేమిస్తున్న కంటెస్టెంట్లకు రిటర్న్ గిఫ్ట్ లేకపోతే ఎలా? మీకోసమే ఒక రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశామని రిటర్న్ గిఫ్టులో భాగంగా కామన్ మ్యాన్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామంటూ తెలియజేశారు. బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి ఎవరికైతే ఉందో వారు కేవలం www.bb9. jiostar.com వెబ్ సైట్ లో మీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు.
వీడియో అప్లోడ్ చేస్తే చాలు..
ఈ వెబ్ సైట్ లో మీ పేరు, మీ చిరునామా వంటి వివరాలను నమోదు చేయాలి అదేవిధంగా మీరు ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనాలి అనుకుంటున్నారనే విషయాలను తెలియజేస్తూ ఒక వీడియో కూడా అప్లోడ్ చేయాలని తెలియజేశారు. ఇలా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారో అలాంటి వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి. సింపుల్ గా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనే ఛాన్స్ అందుకోవచ్చు. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో గత కొన్ని సీజన్లో కూడా కామన్ మ్యాన్ క్యాటగిరీ కింద పలువురు సాధారణ వ్యక్తులు పాల్గొన్నారు.
ఇలా తొమ్మిదవ సీజన్లో కూడా మరోసారి కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా సాధారణ వ్యక్తులకు కూడా అవకాశాలను కల్పించటం విశేషం. ఇకపోతే ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రసారం కాబోతున్న నేపథ్యంలో నిర్వాహకులు వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లుగా పాల్గొనబోయే వారు వీళ్లే అంటూ ఎంతో మంది సెలెబ్రెటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఎప్పటిలాగే ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి ఈ సీజన్ ఎంతో వినోదాత్మకంగా, ఉత్కంఠ భరితంగా కొనసాగుతుందని ఇటీవల విడుదల చేసిన ప్రోమో చూస్తేనే స్పష్టం అవుతుంది.
Also Read: Big TV Kissik Talks Show : నాకు డబ్బులు చాలా ఉన్నాయి… ట్రోలర్స్ కు గడ్డి పెట్టిన శుభశ్రీ!