ED Notice to Hero Sriram: హీరో శ్రీరామతో పాటు మరో నటుడికి ఎన్ఫోర్స్మేట్ డైరెక్టర్ (ED) అధికారులు నోటీసులు ఇచ్చారు. కొకైన్ అక్రమ రవాణాలో కేసులో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్ అనే విషయం తెలిసిందే. శ్రీరామ్తో పాటు మరో నటుడు కృష్ణకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. శ్రీరామ్ ఈ నెల 27న, కృష్ణను 28వ తేదీన విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ నేడు శుక్రవారం నోటీసులు ఇచ్చినట్టు ఈడీ తెలిపింది.
కాగా మాదక ద్రవ్యాల రవాణాకు సంబంధించిన ఈ ఏడాది జూన్లో శ్రీరామ్పై మనీలాండరింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్ రావడంతో చెన్నై పోలీసులు శ్రీరామ్తో పాటు మరో నటుడు కృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెకెక్టరేట్కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన శ్రీరామ్ ప్రస్తుతం బెయిలుపై బయటకు వచ్చాడు.
మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కేసులో తాజాగా నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా శ్రీరామ్, కృష్ణ వాంగ్మూలాలను తీసుకుని దాని ఆధారంగా కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాదు నార్కొటిక్ పరీక్షల్లోనూ శ్రీరామకు పాజిటివ్ రావడంతో చెన్నై పోలీసులు జూన్లో కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన ఫోన్ చేసి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీయగా.. శ్రీరామ్ దాదాపు రూ. 4.50 లక్షల అనుమానస్పదంగా లావాదేవీలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు 40 సార్లు కొకైన్ కొన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్నాడీంకే ఐటీ వింగ్ మాజీ నేత ప్రసాద్ అరెస్టుతో శ్రీరామ్ పేరు బయటకు వచ్చింది.