Google Pay – Tick Squad: గూగుల్ పే ఓపెన్ చేసిన వాళ్లందరికీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న టిక్ స్క్వాడ్ ఛాలెంజ్ ఒక పెద్ద సంచలనంగా మారింది. గూగుల్ పే ఇంతవరకు మనకు రివార్డ్స్ ఇచ్చినప్పటికీ, ఈసారి మాత్రం గేమ్ ఫీలింగ్‌తో, ఫ్రెండ్స్‌తో కలసి ఆడే ఒక కొత్త ఆఫర్ ఇచ్చింది. దీనిపేరు టిక్ స్క్వాడ్. ఇందులో పాల్గొని రూ.1000 వరకు క్యాష్ రివార్డ్ పొందే అవకాశం ఉందట. అందుకే ఇప్పుడు అందరూ “గూగుల్ పే ఓపెన్ చెయ్ రా, టిక్ స్క్వాడ్‌లో జాయిన్ అవ్వు రా” అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు.
జస్ట్ ఇలా చేయండి
ఈ ఆఫర్ గూగుల్ పే హోమ్ స్క్రీన్‌లోనే కనబడుతుంది. యాప్ ఓపెన్ చేసిన వెంటనే టిక్ స్క్వాడ్ అనే బ్యానర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీరే ఒక స్క్వాడ్ క్రియేట్ చేయవచ్చు లేదా మీ ఫ్రెండ్ స్క్వాడ్‌లో జాయిన్ కావచ్చు. ఒక స్క్వాడ్‌లో మొత్తం నలుగురు సభ్యులు ఉండాలి మీరు, మీ ముగ్గురు స్నేహితులు.
టాస్క్ ఇలా ఫాలో అవ్వండి
ఇప్పుడు ఈ నలుగురూ కలసి కొన్ని చిన్న చిన్న టాస్కులు చేయాలి. ఉదాహరణకు రూ.30 లేదా అంతకంటే ఎక్కువ డబ్బు ఎవరికైనా పంపడం, ఒక మొబైల్ రీచార్జ్ చేయడం లేదా ఒక బిల్లు చెల్లించడం. ప్రతి సభ్యుడు తన టాస్క్ పూర్తి చేసినప్పుడు, స్క్వాడ్‌కి ఒక టిక్ మార్క్ వస్తుంది. అన్ని టాస్కులు పూర్తయిన తర్వాత స్క్రీన్‌పై టిక్ స్క్వాడ్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఇక తర్వాత గూగుల్ పే మీ స్క్వాడ్‌కి ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తుంది. దానిని స్క్రాచ్ చేస్తే రూ.20 నుండి రూ.1000 వరకు క్యాష్ రివార్డ్ వస్తుంది. ఇది పూర్తిగా లక్క్‌పై ఆధారపడి ఉంటుంది.
యూజర్లకు రివార్డ్
ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఆఫర్ పెద్ద హంగామా సృష్టించింది. చాలామంది నాకు 1000 వచ్చింది, నాకు 200 వచ్చింది అంటూ తమ స్క్రీన్‌షాట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలసి చేసే ఈ సరదా ఆఫర్ అందరికీ చిన్న ఉత్సవంలా మారింది. గూగుల్ పే ఈ ఆఫర్ ద్వారా యూజర్లకు కేవలం రివార్డ్ మాత్రమే కాకుండా గేమ్‌లా ఎంజాయ్ చేసే అనుభూతి ఇస్తోంది.
ఫ్రెండ్స్‌తో సరదా
గూగుల్ పే ఈ టిక్ స్క్వాడ్ ఆఫర్ ద్వారా యూజర్ల యాక్టివిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ మనలాంటి యూజర్లకు మాత్రం ఇది ఒక చిన్న గేమ్‌లా, సరదాగా, కొంత డబ్బు గెలుచుకునే అవకాశంలా మారింది. ఇది కేవలం డబ్బు కోసం కాదు ఫ్రెండ్స్‌తో కలసి చేసే సరదా కోసం కూడా.
ఆలస్యం చేస్తే ఆటోమేటిక్ క్లోజ్
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఆఫర్‌కి టైమ్ లిమిట్ ఉంటుంది. మీరు టిక్ స్క్వాడ్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని రోజుల్లోపు టాస్కులు పూర్తి చేయాలి. ఆలస్యం చేస్తే ఆ ఛాలెంజ్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది. అలాగే, ఒక్కో యూజర్‌కి ఈ ఛాన్స్ ఒకసారి మాత్రమే లభిస్తుంది. మరోసారి జాయిన్ కావడం సాధ్యం కాదు. మీరు వాడుతున్న యాప్ లేటెస్ట్ వెర్షన్‌లో ఉండాలి. లేకపోతే టిక్ స్క్వాడ్ ఆఫర్ కనబడదు. ఇప్పటికే చాలామంది ఈ ఆఫర్ ద్వారా లక్కీ అయ్యారు. కొంతమందికి రూ.1000 వరకు వచ్చింది.ఇది పూర్తిగా లక్క్‌పై ఆధారపడినా, మీరు ప్రయత్నిస్తే మీకు కూడా రివార్డ్ రావచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా గూగుల్ పే ఓపెన్ చేయండి. టిక్ స్క్వాడ్ బ్యానర్‌పై క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌ని కలుపుకోండి. టాస్కులు పూర్తి చేయండి. ఆ తర్వాత స్క్రాచ్ కార్డ్ ఓపెన్ చేసి లక్క్‌ని పరీక్షించండి.