Kurnool Bus Incident: కర్నూలు బస్సు ప్రమాదం వెనుక కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు బస్సు డ్రైవర్‌ది తప్పంటే.. మరికొందరు బైక్ రైడర్‌ది తప్పుని అంటున్నారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఈ ఘటన గురించి తెలిసి ఏకైక వ్యక్తి ఆ బస్సు డ్రైవర్ మాత్రమే. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతడు అరెస్టయితే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.
బస్సు ఘటనలో బైకర్ మృతి
బైక్‌ని ఢీ కొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైకర్ శివశంకర్ స్పాట్‌లో మృతి చెందాడు. ఈ ప్రమాదంపై మృతుడి కుటుంబసభ్యులు నోరు విప్పారు. బస్సు ప్రమాదం ఎప్పుడు జరిగిందో తమకు తెలీదన్నాడు శివశంకర్ సోదరుడు శ్రీహరి. తాము కూలి పనులు చేసుకుని బతికేవాళ్లమని, ఎప్పటి మాదిరిగా ఏడు గంటలకు తాము నిద్ర లేచినట్టు చెప్పాడు.
ప్రమాదం గురించి తమకు తెలీదన్నాడు. మా అంకుల్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడని అన్నాడు. వెంటనే స్పాట్‌కు వెళ్లి చూశామని, మా తమ్ముడ్ని ఆ స్థితిలో చూసి షాకయ్యాడు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులు ‘బిగ్ టీవీ’తో మాట్లాడారు. మా పేరెంట్స్‌కు ఇద్దరు కొడుకులమని, మా తమ్మడు వయస్సు 21 ఏళ్లని చెప్పాడు. ఎవరి తప్పయినా తాము ఏమి చేస్తామని చెప్పాడు.
శివశంకర్ చివరిమాట అదే
ఇంకా పెళ్లి కాలేదని, గతరాత్రి పనికి వెళ్లి వచ్చాడని తెలిపాడు. బయటకు ఎక్కడి వెళ్లినా చెప్పేవాడని, రాత్రి మాత్రం చెప్పలేదన్నాడు. రాత్రి పదిన్నర సమయంలో ఇంటి నుంచి తమ్ముడికి ఫోన్ చేశామని, తాను డోన్‌లో ఉన్నానని వచ్చి భోజనం చేస్తానని చెప్పాడని, అవే చివరి మాటలు అయ్యాయని అన్నాడు.
ALSO READ: కర్నూలు ఘటన.. ప్రయాణికుల జాబితా, ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయండి
కళ్లముందు తిరిగిన శివశంకర్ మృతి చెందడాన్ని అతడి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. శివశంకర్ సొంతగ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. నలుగురితో సరదాగా మాట్లాడేవాడని, ఏదైనా అవసరం ఉందని చెబితే తెలిసిన సాయం చేసేవాడని అంటున్నారు ఆ ఊరి గ్రామస్తులు.