BigTV English
Advertisement

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

World Fastest Electric Bikes:

ఆటో మోబైల్ ఇండస్ట్రీతో పాటు టూ వీలర్ రంగంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు, బైకులు అందుబాటులోకి వస్తున్నాయి. 2025 అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ లు విడుదలయ్యాయి. అధునాతన బ్యాటరీలు, అద్భుతమైన డిజైన్లతో..  పెట్రోల్ సూపర్‌ బైక్‌ల మాదిరి వేగాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌లు ఏవి? వాటి వేగం ఎంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ లైట్నింగ్ LS-218

లైట్నింగ్ LS-218 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇ-బైక్‌ గా గుర్తింపు పొందింది. దీని గరిష్ట వేగం గంటకు 350 కి.మీ. LS-218 200 hp మోటార్, 380V బ్యాటరీతో నడుస్తుంది. క్షణాల్లో 0 నుంచి 240 కిలో మీటర్ల వరకు వేగాన్ని అందుకుంటుంది. ఒకే ఛార్జ్‌ పై దాదాపు 240 కి.మీ. రేంజ్ ను కలిగి ఉంది.

⦿ వోక్సాన్ వాట్‌ మాన్

ఈ బైక్ 367 hp పవర్ ఫుల్ మోటార్ ను కలిగి ఉంటుంది. 15.9 kWh బ్యాటరీతో వస్తుంది. ఈ బైక్ గంటకు ఏకంగా 455 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ ఇదే.


⦿ డామన్ హైపర్‌స్పోర్ట్ ప్రీమియర్

ఈ బైక్ గంటకు 322 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. హైపర్‌ స్పోర్ట్ ప్రీమియర్ AI సేఫ్టీ అసిస్టెన్స్ తో పాటు  ఎర్గోనామిక్స్‌ ను కూడా ప్రదర్శిస్తుంది. ఒకే ఛార్జ్‌ తో 300 కిలో మీటర్లు ప్రయానిస్తుంది. ఈ బైక్ ను స్మార్ట్ బైక్ గా రూపొందించారు.

⦿ ఎనర్జికా ఈగో+ ఆర్ఎస్

ఇటలీలో తయారు చేయబడిన ఈగో+ ఆర్ఎస్ గంటకు 240 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బైక్ మోటార్ 171 ఎన్ఎమ్ టార్క్‌ ను కలిగి ఉంటుంది. ఇది 21.5 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో పాటు 420 కి మీ రేంజ్ అందిస్తుంది.

⦿ వెర్జ్ టిఎస్ అల్ట్రా

హబ్‌ లెస్ రియర్ వీల్‌ కు పెట్టింది పేరుఅయిన వెర్జ్ టిఎస్ అల్ట్రా, గంటకు 322 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. 2.5 సెకన్లలో ఏకంగా  0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ 20.2 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది కేవలం 25 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

⦿ ఆర్క్ వెక్టర్

UKలో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ 201 HP సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ బైక్ గంటకు 322 km గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది.

⦿ జీరో SR/S

ఈ బైక్ గరిష్టంగా గంటకు 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్క ఛార్జ్ తో  250 km రేంజ్ ను పొందుతుంది.

⦿ హార్లే-డేవిడ్సన్ లైవ్‌వైర్ S2 డెల్ మార్

ఈ బైక్ 3.1 సెకెన్లలో 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 160 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది.

⦿ BMW CE 02

BMW CE 02 సిటీలో నడిపేందుకు అనుగుణంగా ఉంటుంది. గరిష్టంగా గంటకు 95 km వేగంతో నడుస్తుంది.

⦿ టార్ఫార్మ్ లూనా

ఈ బైక్ గరిష్టంగా 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎకో ఫ్లాక్స్ ఫైబర్, రీసైకిల్ చేసిన అల్యూమినియంతో టార్ఫార్మ్ లూనా తయారైంది.

Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Related News

Vivo 78 Launch: వివో 78 కొత్త లుక్‌.. ఫోటో లవర్స్‌, గేమర్స్‌కి డ్రీమ్ ఫోన్‌..

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Vivo Y500 Pro: త్వరలో Vivo Y500 Pro లాంచ్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Apple iPhone 18: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో వచ్చేస్తోన్న

Moto G67 Power: 7,000mAh బ్యాటరీ, 6.7 ఇంచుల డిస్ ప్లే.. రిలీజ్ కు ముందే Moto G67 స్పెసిఫికేషన్లు లీక్!

Lava Agni 4: త్వరలో లావా అగ్ని 4 లాంచింగ్.. డిజైన్, స్పెసిఫికేషన్లు అదుర్స్ అంతే!

Free ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ.. ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Big Stories

×