Piyish Pandey Died: వాణిజ్య ప్రకటనల రూపకర్త పీయూష్ పాండే (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న ఆయన శుక్రవారం తెల్లావారుజామున (అక్టోబర్ 24) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త ప్రముఖ ప్రకటనల సంస్థ ఓగ్లీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆయనకు ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటింస్తున్నారు.
ప్రధాని మోదీ సైతం పీయూష్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకటనల రూపకల్పనలో పీయూష్ పాండే సృజనాత్మకత అద్భుతమని. ఆయన రూపొందించిన ప్రకటనలు తరతరాల పాటు భారతీయుల మనసులో చెరగని ముద్రవే వేశాయిచిరస్థాయిలో నిలుస్తాయ అంటూ ఎక్స్ వేదిగా ప్రధాని నివాళులు అర్పించారు. బాడీ ఇన్ఫెక్షన్తో పరిస్థితి విషమించి నేడు మరణించారు. కాగా అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ఆయన కోమాలో ఉన్నట్టు సమాచారం. కాగా సుమారు నాలుగు దశాబ్ధాలుగా ఆయన అడ్వర్టైజింగ్ పరిశ్రమలో ఉన్నారు. ఫెవికాల్, క్యాడ్‌బరీ, ఏషియన్ పేయింట్స్ లాంటి ప్రఖ్యాత బ్రాండ్‌లకు ఆయన యాడ్స్ రూపొందించారు.
Shri Piyush Pandey Ji was admired for his creativity. He made a monumental contribution to the world of advertising and communications. I will fondly cherish our interactions over the years. Saddened by his passing away. My thoughts are with his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) October 24, 2025
Also Read: Sriram: కొకైన్ అక్రమ రవాణా.. హీరో శ్రీరామ్కు ఈడీ నోటీసులు
ఓగ్లివీ యాడ్ కంపెనీలో చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా చేశారు. 1982లో ఓగ్లివీ కంపెనీలో పాండే చేశారు. సన్లైట్ డిటర్జేంట్ కోసం ఆయన తొలిసారి యాడ్ రాశారు. ఆరేళ్ల తర్వాత కంపెనీ క్రియేటివ్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆ తర్వాత ఎన్నో యాడ్స్ ఆయన రూపొందించారు. ముఖ్యంగా ఫెవికాల్, క్యాడ్‌బరీ, ఏషియన్ పేయింట్స్, లూనా మోపెడ్, ఫార్చూన్ ఆయిల్ వంటి యాడ్లకు ఈయనే రూపకర్త. ఓగ్లివీ ఇండియా యాడ్ ఏజెన్సీ ఛైర్మన్ వ్యవహరించినంత కాలంగా ఓగ్లివీ వరుసగా నెంబర్ వన్ స్థానంలో ఉంది. వరుసగా 12 ఏళ్ల పాటు ఈ కంపెనీ నెంబర్ వన్ స్థానంలో రాణించింది. తనదైన స్రజనాత్మకతతో యాడ్స్ రూపొందించి మార్క్ పొందిన ఆయన క్రియేటివ్ రంగంలో పద్మశ్రీ అవార్డుతో ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు. యాడ్స్ రూపకర్త మాత్రమే కాదు సినిమాల్లోనూ ఆయన నటించారు. 2013లో రిలీజైన మద్రాస్ కేఫ్ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాదు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి ఆయన పలు ప్రచారా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.