Kurnool Bus Accident: కర్నూల్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు.. తెలంగాణ సర్కార్ ఆర్ధిక సాయం అందించింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు .. రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు.. జెన్కో సీఎండీ హరీష్‌ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశారుల జారీ చేశారు.
ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కర్నూల్‌లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం అన్నారు. మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో టెలిఫోన్లో మాట్లాడడం జరిగిందన్నారు.
Also Read: కర్నూలు బస్సు ప్రయాణికుల జాబితా.. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్‌కు కాల్ చేయండి
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ,కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులం రవాణా శాఖ కమిషనర్లు సమావేశం ఏర్పాటు చేస్తాం అన్నారు. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం. బస్సులపై రోజువారి రవాణా శాఖ చెక్ చేస్తే.. వేధింపులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవోదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది.. కానీ హైదరాబాదు నుండి బెంగళూరు తిరుగుతుందన్నారు. మృతుల కుటుంబాలకు మా సానుభూతి వ్యక్తం చేశారు.